/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి Yadagiri Goud
లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలు కమిటీనీ ప్రకటించింది.

25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరి స్తారు.డిప్యూటీ సీఎం భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సిం హారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు.

మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుక చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీత రావులకు ఈ కమి టీలో చోటు కల్పించారు

వీరితో పాటు కమిటీలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా కమిటీలో చోటు కల్పించింది.

13 నుంచి జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ నెల 13వ తదీ నుంచి 16వ తేదీ వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇచ్చా రు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్య లు తీసుకుంటామని ఈమే రకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యా లకు ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది.

తిరిగి 17వ తేదీన కళాశా లలు ప్రారంభమవు తాయ ని తెలిపింది.ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జూనియర్‌ కళాశాలలన్నీ పాటించాలని పేర్కొంది..

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వా నించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సహాయ సహకా రాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం తెలిపారు.

వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

టైర్-2, 3లలో ఐటీలను అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యో గాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదన్నారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణురెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్ కార్పొరేట్ వ్యవహారాలు చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ పాల్గొన్నారు.

హైదరాబాద్ జిహెచ్ఎంసి లో అధికారుల బదిలీలు

రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని తొలగించి రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలక అధికా రులను బదిలీ చేసింది. ఈ మేరకు ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

కూకట్‌పల్లి జోనల్ కమిష నర్‌గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు.

ఆమె స్థానంలో ఐఏఎస్‌ అధికారిణి అభిలాషా అభినవ్‌ నియమితు లయ్యారు. కాగా, 2010 నుంచి 2018 వరకు శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన వి.మమత.. 2018 నుంచి కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా కొనసాగు తున్నారు.

అలాగే శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిణి స్నేహా శబరీష్‌కు బాధ్యతలు అప్పగించారు.

వీరితో పాటు మరికొందరు డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈగా బదిలీ అయ్యారు.

ప్రస్తుతం ఎస్ ఈగా ఉన్న మల్లికార్జున్ ఈఎన్ సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించిం ది.జీహెచ్‌ఎంసీ ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాసరెడ్డి, ఫలక్‌నుమా అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.లావణ్య, కుత్బుల్లాపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.న ర్సింహలను నియ మించారు.

సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.నాగమణి, చార్మినార్ డిప్యూటీ కమి షనర్ గా ఎ.సరితను నియమిస్తూ జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.

TDP: ఈసీ బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్‌.. వెంకటగిరి సభ వాయిదా

అమరావతి: ఈనెల 9న వెంకటగిరిలో నిర్వహించాల్సిన 'రా.. కదలిరా..' కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు ఉదయం విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని..

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి..

సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది..

‘ఆదిత్య-ఎల్‌1’ విజయవంతం

బెంగళూరు: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది.

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం చేపట్టిన కీలక ఘట్టం ఫలించింది.

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది.

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్‌1’ లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే కావడం గమనార్హం.

ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించలేరు: ఎమ్మెల్యే హరీష్ రావు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్ల మెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు.ప్రజలగుండెల్లో ఉన్న కేసీఆర్‌ను తొలగించలేరని అన్నారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్‌ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల పై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీ స్తామని హెచ్చరించారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం లో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేద’ని అన్నారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు.

ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపో యామని అన్నారు.

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిది.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

మొన్నటి ఎన్నికలు కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకు నేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని అన్నారు ..

ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు భారీగా నగదు స్వాధీనం

హైదరాబాదులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

నిందుతుల నుంచి 1.4కోట్ల నగదు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ కు చెందిన బాధితురాలు 3 కోట్ల 16 లక్షలు ఈ నేర‌గాళ్ల నష్టపోయిందని చెప్పారు. ఆమె ఇచ్చిన ఆధారాల‌తో నిందితుడిని గోవాలో అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ ఇద్ద‌రు dafabet అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నార‌ని తెలిపారు..ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా నిందితులు ఒప్పుకున్నార‌ని పేర్కొన్నారు.

నిందితుల నుంచి రూ 1.40 కోట్లు న‌గదును స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు డ్రా చేశామని వెల్ల డించారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

ఈ కేసులో నిందితులు ఇతరులకు చెందిన 95 బ్యాంక్ అకౌంట్స్ వాడుతు న్నార‌ని గుర్తించామన్నారు. పెట్టుబడులు, ఆన్ లైన్ గేమ్ లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడు తున్నారని కమిషనర్‌ అన్నారు.

సింగపూర్, హాంకాంగ్ నుంచి నిందితులు ఫోన్లు చేస్తూ.. భారీగా లాభాలంటూ నమ్మించి మోసాలకు దిగుతారన్నారని చెప్పారు. సోషల్ మీడియాలో నిందు తులు కనెక్ట్ అవుతారని పాస్ వర్డ్స్, ఓటీపీ విష యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు.

సైబర్ నేరగాళ్లపై ఇంకా దర్యాప్తు కొనసాగు తుందని చెప్పారు. నిందితు లను పట్టుకున్న పోలీసుల ను సీపీ అభినందించారు.

మాజీ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు హైద‌రా బాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

రాజ్‌భవన్‌లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించారు. రామ్ నాథ్ కోవింద్ కు రేవంత్ రెడ్డి వీణను బహుకరించారు.

ఆయనతో కాసేపు వివిధ అంశాలపై చర్చించారు. దేశమంతా ఒకేసారి ఎన్ని కలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయ నం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృ త్వంలో కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ఛైర్మన్‌గా రామ్ నాథ్ కోవింద్ ఉన్నారు.

నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్

మల్లంపేట లోని నారాయణ మహిళా జూనియర్ కళా శాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.

గతంలో కళాశాలలో చదు వుతున్న విద్యార్థులను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటా హుటిన విద్యార్థు లను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తర లించినట్లు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారం, తాగు నీరు కలుషితం కావడమే కారణంగా తెలుస్తుంది.

కళాశాల వంటగదిని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమా చారం. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను యాజమాన్యం తరలిస్తు న్నట్లు తెలుస్తోంది.

1500 మంది విద్యార్థులు ఉన్న మల్లంపేట నారాయణ మహిళా జూనియర్ కళాశా లలో కలుషిత ఆహారం, తాగు నీటి సమస్య వల్ల 200 మందికి పైగా విద్యా ర్థులు అస్వస్థతకు గురికా వడంతో సంక్రాంతి సెలవులు పేరుతో గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను ఇళ్లకు తరలించారు.

ఓ వైపు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నా సంక్రాంతి 10 రోజుల ముందే విద్యా ర్థులకు సెలవుల పేరుతో తరలిస్తుండడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందు తున్నారు. కళాశాల ఏజీఎం ప్రసాద్‌ను వివరణ కోరగా వాతావరణ సమస్య వలన కొందరు విద్యార్థులు అస్వ స్థతకు గురైంది వాస్తవమే అన్నారు.

విద్యార్థులు ఆందోళన చెందకుండా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తా మన్నారు.