నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్
మల్లంపేట లోని నారాయణ మహిళా జూనియర్ కళా శాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.
గతంలో కళాశాలలో చదు వుతున్న విద్యార్థులను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటా హుటిన విద్యార్థు లను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తర లించినట్లు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారం, తాగు నీరు కలుషితం కావడమే కారణంగా తెలుస్తుంది.
కళాశాల వంటగదిని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమా చారం. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను యాజమాన్యం తరలిస్తు న్నట్లు తెలుస్తోంది.
1500 మంది విద్యార్థులు ఉన్న మల్లంపేట నారాయణ మహిళా జూనియర్ కళాశా లలో కలుషిత ఆహారం, తాగు నీటి సమస్య వల్ల 200 మందికి పైగా విద్యా ర్థులు అస్వస్థతకు గురికా వడంతో సంక్రాంతి సెలవులు పేరుతో గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను ఇళ్లకు తరలించారు.
ఓ వైపు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నా సంక్రాంతి 10 రోజుల ముందే విద్యా ర్థులకు సెలవుల పేరుతో తరలిస్తుండడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందు తున్నారు. కళాశాల ఏజీఎం ప్రసాద్‌ను వివరణ కోరగా వాతావరణ సమస్య వలన కొందరు విద్యార్థులు అస్వ స్థతకు గురైంది వాస్తవమే అన్నారు.
విద్యార్థులు ఆందోళన చెందకుండా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తా మన్నారు.
Jan 06 2024, 14:47