సీఎం జగన్ పార్టీకి అంబటి రాయుడి యూటర్న్
వైఎస్సార్ సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు.. సంచలన ప్రకటన చేశారు.
తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుం టున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
అంబటి రాయుడు వైఎస్సార్‌సీపీలో చేరిన పది రోజుల్లోనే వీడటం సంచల నంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు.
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియవలసి ఉంది...
Jan 06 2024, 13:14