చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్…
చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్… బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడింది. నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ గానే మధ్యాహ్నం లోపు తీరం దాటనున్నది మిచౌంగ్. ఈ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
Dec 05 2023, 09:06