కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
చర్ల మండలం కలివేరు
గ్రామపంచాయతీ రజిబెల్లి కాలనీలో బుటారి జోగయ్య ఇల్లు నిన్న మధ్యాహ్నం 11:30 నిమిషాలకు దగ్ధమై ఇంటిలో ఉన్న సామానులు వాటితోపాటు చేతికొచ్చిన నాలుగు ఎకరాల పత్తి, ఎకరం ధాన్యం మొత్తం కాలిపోయి (దగ్దం )అయ్యాయి కుటుంబమంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు వీరిని ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
బుటారి జోగయ్య కుటుంబం రాత్రింబవళ్లు కష్టపడి పండించుకున్న పంట కళ్ళముందే దగ్ధం అవడంతో దిక్కుతోచని పరిస్థితి కి నెట్ వేయబడ్డారని వారినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అధికారుల మీద కూడా ఉందని వారన్నారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 5000/విలువగల సామాగ్రి గిన్నెలు బట్టలు, దుప్పట్లు బియ్యం, నిత్యవసర సరుకులు 500 రూపాయల సహాయం చేయడం జరిగినది. ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేసి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.అట్లాగే చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని అనేక సార్లు కార్యక్రమాలు దీక్షలు చేసిన ఈ ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు అధికారులు దున్నపోతుల మీద వర్షం పడ్డట్టుగా వ్యవరిస్తున్నారు ఇప్పటికైనా చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి గా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి చర్ల మండల నాయకులు భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క ఇరుప సమ్మక్క కనితి రాజమ్మ పోడియం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Dec 04 2023, 17:22