కెసిఆర్ పాలనలోనే కుల వృత్తులకు జీవం
కెసిఆర్ పాలనలోనే కుల వృత్తులకు జీవం
సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలే
రాజకులని పట్టించుకోని పాపం గత పాలకులదే
కులవృత్తిదారులకు లక్ష సాయం దేశంలో ఎక్కడా లేదు
ఆశీర్వదించండి ..అండగా ఉంటా
విశ్వబ్రాహ్మణ, రజక సహకార సంఘం ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట
గత పాలకుల హయాంలో కుంటుపడిన కులవృత్తులకు తిరిగి జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి ,సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో విశ్వబ్రాహ్మణ, రజక సంఘం ఆధ్వర్యంలనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలు అయితే రెక్కల కష్టమే జీవనం సాగిస్తూ సమాజ సేవకు పాల్పడుతున్న గొప్పతనం రజకులది అన్నారు.అనేక సంవత్సరాలు రాష్ర్టాన్ని పరిపాలించిన గత పాలకులు రజకులను, విశ్వ బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రజకులు, విశ్వ బ్రహ్మణ సోదరులు కులవృత్తిలో ఆర్థికంగా ఎదగడం కోసం లక్ష సాయం,లాండ్రి షాపులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న పథకం దేశంలో తెలంగాణలో మినహా ఎక్కడా లేవన్నారు. తెలంగాణలో బీసీ సామాజికవర్గ కులాల్లో ఎక్కువగా అణచివేయబడిన కు రజకులు శ్రమ దోపిడీకి గురై సమాజంలో చిన్నచూపు చూడబడ్డారన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా రజకులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రజకుల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నదన్నారు.అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, విశ్వకర్మ ,జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని రజక, విశ్వబ్రహ్మణ సంఘాలు గతంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తూ ఆత్మగౌర వం పెంపొందించేలా చేసింది. అలాంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో, విశ్వబ్రాహ్మణ, రజకులు కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Dec 02 2023, 09:21