అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం
అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక
భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం
ప్రెవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్నా అర్హులైన సిబ్బందికి రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, గృహలక్ష్మి మరియు డబల్ బెడ్రూమ్ మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.
స్థానిక ఎన్.ఆర్.ఎస్ గార్డెన్ మర్రిగూడ బైపాస్ యందు ఏర్పాటు చేసిన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి విద్యా సంస్థల ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..తన గెలుపు కొరకు సంఘీభావం ప్రకటించిన ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది మరియు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఈ సందర్బంగా ట్రాస్మాగౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి మరియు విద్యా సంస్థల ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ .. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలంటే మరోమారు బి.ఆర్.ఎస్. కె పట్టం కట్టాలని దానిలో భాగంగా మన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యదర్శి తలకోల పురుషోత్తం,,డిగ్రీ మరియు పీజీ కళాశాలల సామాల వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షులు చందం శ్రీను, ట్రాస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.రావ్, పట్టణ అధ్యక్షులు ఎం.డి అజీజ్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, లీగల్ సెల్ సలహాధారు కె.జవహర్, కేజీ టు పీజీ పరిశీలకులు ఇ.రాధాకృష్ణ, గొర్రె వెంకట్ రెడ్డి, వై శివశంకర్, ఎ. ప్రణీత్, పాముల అశోక్, గిరిధర్ గౌడ్, శ్రీమతి అమరావతి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ, జిల్లా టి.పి.టి ఫేడరేషన్ ప్రతినిధులు బక్క నర్సింహా, ఏ.వెంకన్న, బి.రాంబాబు, బొజ్జ రాజు మరియు టి.పి.టి. ఫోరం ప్రతినిధులు మధుమూర్తి, సంజీవ రెడ్డి, సోమయ్య సహా వందలాది మంది నియోజకవర్గం పరిధి లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, లెక్చరర్స్,యాజమాన్య ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు
Nov 27 2023, 13:21