NLG: దేవరకొండలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నేడు దేవరకొండ పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, స్వాతంత్ర్యం నకు పూర్వం దేశ ప్రజలకు.. వలస పాలకుల, రాజరికపు పాలకుల పాలనలో కేవలం వాళ్ళు చెప్పిందే అమలయ్యేదని.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశంలోని కోట్లాదిమంది ప్రజలకు విద్య, వైద్యం, సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు.
భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయకుమార్, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు రాములు, రాజేష్, రాజ్ కుమార్, గిరి తదితరులు పాల్గొన్నారు
Nov 26 2023, 19:32