/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ రెండవరోజు పర్యటన Mane Praveen
TS: నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ రెండవరోజు పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు ప్రియాంక గాంధీ పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు లో ప్రియాంక రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి లో కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు.

అదేవిధంగా మధ్యాహ్నం 2.40 గంటలకు మధిర కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.

NLG: డబ్బును ఓడించండి.. నిజాయితీని గెలిపించండి:: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా:

నకిరేకల్ నియోజకవర్గం, రామన్నపేట పట్టణం: నిర్నేముల, శోభనాద్రిపురం, లక్ష్మాపురం ల, కొత్తగూడెం నిదానపెళ్లి గ్రామాలల్లో బి ఎస్ పి అభ్యర్థి మేడి ప్రియదర్శిని శుక్ర వారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో షాప్ టు షాప్, గ్రామాల్లో గడప గడప తిరుగుతూ డబ్బును ఓడించండి నిజాయితీని గెలిపించండి అంటు నోటు ఇవ్వండి ఓటు వెయ్యండి అంటూ తిరిగారు.

మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రతి ఒక్కరూ ప్రోలోభావాలకు గురికాకుండా ఓటు వేయాలని తన ఎన్నికల ఖర్చులను కూడా ప్రజల నుండే సేకరిస్తున్నట్టు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,మండల అధ్యక్షులు మేడి సంతోష్, మండల ఉపాధక్షులు గుని రాజు, మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల కార్యదర్శి బందెల అనిత, మండల కోశాధికారి గట్టు రమేష్, నాయకులు నన్నెపక రామ్ కుమార్,మల్లేష్, వినయ్, మల్లికార్జున్, ఉదయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

TS: రైతు బంధు పంపిణీకి తొలగిన అడ్డంకులు

తెలంగాణలో ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ కు ఊరట లభించింది. రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగడం తో, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిధుల విడుదలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

TS: ఈనెల 25న మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శనివారం, 3 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రచార సభలలో పాల్గొనున్నారు.

రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు మొదట బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారు.

ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.

TS: రేపు 4 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. రేపు 4 నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.

ఉదయం 10 గంటలకు జుక్కల్ బహిరంగసభ

ఉదయం 11.30 గంటలకు షాద్ నగర్ బహిరంగసభ

మధ్యాహ్నం 12.30 గంటలకు ఇబ్రహీంపట్నం బహిరంగసభ

మధ్యాహ్నం 2గంటలకు కల్వకుర్తి బహిరంగసభ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.

NLG: సరంపేటకు చెందిన 50 మంది కూసుకుంట్ల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, సరంపేటకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి సరంపేట గ్రామ బీఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ వర్కల వెంకటేష్ ఆధ్వర్యంలో.. మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నక్క రవి ,నక్క రమేష్, ఎడ్ల మల్లేష్, సంగేపు గిరి నేత, మోటం మల్లయ్య, గంటేకంపు కృపయ్య తదితరులు పాల్గొన్నారు.

TS: జోగులాంబ గద్వాల్ జిల్లాలో, నేడు.. రూ. 3,07,000/- సీజ్

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్:

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ లో బాగంగా పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీ లలో ఈ రోజు 3,07,000/-  రూపాయలు సీజ్ చేసినట్లు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.

కామారెడ్డి: కాంగ్రెస్ లో చేరిన జడ్పిటిసి తీగల తీరుమల్ గౌడ్

కామారెడ్డి:

దోమకొండ మండలం జడ్పిటిసి తీగల తీరుమల్ గౌడ్ మరియు గ్రామ రైతు బంధు కన్వీనర్‌ మధుసూదన్ రెడ్డి BRS పార్టీ కి రాజీనామా చేసి కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.



NLG: కాంగ్రెస్ లో చేరిన లెంకలపల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కర్నాటి నాగరాజు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం: మండలంలోని, లెంకలపల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కర్నాటి నాగరాజు.. బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ నాయకులు అబ్బనబోయిన దశరథ, నందికొండ లింగారెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శుక్రవారం నల్లగొండ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార షెడ్యూల్

నల్లగొండ పట్టణం

ఉదయం 8:00 గంటలకు భాస్కర్ టాకీస్

17 వ వార్డు ఆర్జాలబావి : ఉ " 9:00 గంటలకు

9 వ వార్డు వెంకటరమణ కాలనీ : ఉ " 10:00 గంటలకు

సాయంత్రం

నల్లగొండ మండలం

మేళ్ళ దుప్పల పల్లి :సా"4:00 గంటలకు

 తొరగాల్ :సా" 5:00 గంటలకు

కనగల్ మండలం

జంగబాయ్ గూడెం : సా" 6:00 గంటలకు

ఇరుగంటి పల్లి : సా"7:00 గంటలకు

చిన్న మాదారం : సా"8:00 గంటలకు

చెట్ల చెన్నారం : సా"9.00 గంటలకు

బాబాసాయి గూడెం : 9.30 నిముషాలకు

బిజెపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు