NLG: ఎన్జీ కళాశాలలో పీజీ సీట్లకు నవంబర్ 25న కౌన్సెలింగ్
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు పీజీ- పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో 2023-24 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్లను.. ఈ నెల 25న స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయబడును. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ CPGET-2023 నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 13 సీట్లు, ఎమ్మెస్సీలో జువాలజీ 24 సీట్లు, ఎం.కాంలో 35 సీట్లు, ఎంఏ తెలుగులో 24 సీట్లు ఎంఏ ఎకనామిక్స్ 43 సీట్లు, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ లో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యస్.ఉపేందర్ తెలిపారు.
డిగ్రీలో 50% శాతం మార్కులు కలిగినవారు 3 పాస్ ఫోటోలు, 3 జతల జీరాక్స్ సర్టిఫికెట్లు, ఒరిజినిల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్ కు హాజరు కాగలరు, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయని వారు కూడా ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డిగ్రీ పూర్తి చేసుకొని 50% పర్సంటేజ్ తో ఉండాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.
విద్యార్థులు కోర్సు ఫీజుతో పాటు యూనివర్సీటీ ప్రాసెసింగ్ ఫీజు రూ.2100 చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించదు. పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయం నందు సంప్రదించాలన్నారు.
Nov 23 2023, 22:20