NLG: మాలల ఐక్యత చాటి చూపిద్దాం: నాగిల్ల మారయ్య
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రంలో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ఈరోజు నాగిల్ల మారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మాల కులస్తులకు అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా మాలలను ఓట్లు వేయడానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్స్ స్థానాలలో కూడా పెత్తందారులు కలగజేసుకుని మాలలను చిన్నచూపు చూడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాలలకు 2,50,000 ఓట్లు ఉన్నా, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో 21,000 ఓట్లు ఉన్నా.. మునుగోడు నియోజకవర్గంలో పదివేల ఓట్లు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ.. విద్యావంతులు, మేధావులు అయినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం మాలలో ఐక్యత లోపించడమేనని మాలలు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మాలల ఐక్యత వర్ధిల్లాలని మాలల వ్యతిరేక శక్తుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, ఇండిపెండెంట్ అభ్యర్థి కోరే యాదయ్య, మరో అభ్యర్థి వి ఆర్ పి ఎమ్మేల్యే అభ్యర్థి నూనె సురేష్, శ్రీకాంత్, మహిపాల్, ఈద అభి సందేశ్, వంపు చరణ్, రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Nov 23 2023, 20:59