నల్గొండ: వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు బహుకరణ
నల్గొండ పట్టణ కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల, గ్రంథాలయ సమాచార శాస్త్రం మరియు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా.. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, రీడతన్ , పుస్తక ప్రదర్శన, పుస్తక సమీక్ష, క్విజ్ పోటీలో నిర్వహించారు. వివిధ పోటీలలో పాల్గొన్న విజేతలకు పుస్తక బహుమతులు మరియు సర్టిఫికెట్ ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.వి గోనా రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో మరియు ప్రపంచ ఉపాధ్యాయ ఫోరం సెక్రటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల గ్రంథాలయాన్ని మరియు సమాచార వనరులని వినియోగించుకొని, వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలని, డిగ్రీ చదువుతున్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీతత్వం పై అవగాహన పెంచుకోవాలని, ఉన్నత విద్యలో పరిశోధనలో విద్యార్థులు రాణించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, కృష్ణ కౌండిన్య, యాదగిరి, లవెందర్ రెడ్డి, నాగుల వేణు, శివరాణి, యాదగిరి రెడ్డి, తదితర అధ్యాపకులు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయకుమార్, గ్రంథాలయ సిబ్బంది సూదిని వెంకట్ రెడ్డి, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Nov 22 2023, 15:50