TS: బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తాం: సీఎం కేసీఆర్
నల్లగొండ: సీఎం కేసీఆర్ నేడు, నల్లగొండ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే హక్కు.. మీ ఓటు, ఆ ఓటు సద్వినియోగం అయితే రాష్ట్రానికి మీకు మంచి జరుగుతుందని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాయి ఏదో రత్నమేదో గుర్తించండి. అభ్యర్థులు వారి వెనకున్న పార్టీల చరిత్ర చూడాలి. గతంలో నల్లగొండలో ఆముదం పంటలే ఉండేవి, ఇప్పుడు బ్రహ్మాండంగా వరి పంటలు పడుతున్నాయి. ప్రస్తుత 10 ఏళ్ల పాలన, గతంలోని 50 ఏళ్ల పాలన ను బెరోజి వేసుకోవాలని కోరారు.
నల్లగొండను కెసిఆర్ దత్తత తీసుకున్నట్లు ప్రజలకు గుర్తు చేశారు. నల్లగొండ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. 1400 కోట్ల నిధులతో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారని, నల్లగొండకు ఐటి టవర్, మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చారని, అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కెసిఆర్ తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయిందని, ఉదయసముద్రం గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తామని అన్నారు. ధరణి వల్ల డైరెక్ట్ గా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు.
ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పేదలకు మంచినీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ నియోజకవర్గ ఇంకా తన దత్తత లోనే ఉందని, రాబోయే రోజుల్లో పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని కెసిఆర్ అన్నారు. ఆర్టీసీ ని గవర్నమెంట్ లో కలిపినాము, తమ ప్రభుత్వం వస్తె, ఆటో వాళ్లకు ఫిట్నెస్ టాక్స్ రద్దు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కెసిఆర్ తెలిపారు.
Nov 20 2023, 22:46