NLG: ప్రభుత్వ ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ ఆంగ్ల భాష బోధన తరగతులు
నల్లగొండ: రాష్ట్ర పరిశోధన విద్యాసంస్థ వారి సహకారంతో విల్ టు కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక రోజు ఫిజికల్ క్లాస్ పట్టణంలోని టీటీడి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామచంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ పాఠశాలలలో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేయటమన్నారు. ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా తరగతులకు హాజరు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విల్ టు కెన్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో 20 జిల్లాల ఉపాధ్యాయులకు ఈ తరగతులను పూర్తి చేశామని, అలాగే ఎస్సీఈఆర్టీ సహకారంతో మొత్తం తెలంగాణలో మిగతా జిల్లాలకు కూడా క్లాసెస్ త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కు, ఇంత మంచి సహకారాన్ని అందించిన డి ఈ ఓ, ఏ.ఎం.ఓ. కు రామేశ్వర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బక్కా శ్రీనివాస చారి, పగిళ్ల సైదులు మరియు 600 మంది టీచర్లు పాల్గొన్నారు.
Nov 19 2023, 21:30