మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి: జగదీశ్వర్ రెడ్డి
మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి
అభివృద్ధి చేసే వారికి మళ్లీ పట్టం కట్టండి
మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద గల తేజ హైస్కూల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు బిక్కు మల్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. గతంలో హైదరాబాద్ మూసి నీరు తాగే పరిస్థితి ఉండేదని నేడు మిషన్ భగీరథ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. గతంలో దీపాల వెలుతురుతో చదువుకునే పరిస్థితులు ఉండేయని, నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 గంటల కరెంటు తో పాటు దేశం లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని కొనియాడారు. నరేంద్ర మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో సైతం
ఇప్పటికి ప్రతిరోజు ఆరు గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. 2014 ముందు ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని బెరీజు వేసుకొని తమ ఓటును వెయ్యాలన్నారు. వ్యాపారస్తులను గతం లో చందాల పేరుతో దందాలు నిర్వహించి బెదిరించే వారని,నేడు శాంతి భద్రతలతో ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. స్మశానవాటికలను రూపుదిద్ది వైకుంఠధామాలుగా మార్చడంతో పాటు పెళ్ళికాని అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వారింట్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. నేడు ఏ గ్రామం వెళ్లిన కాలేశ్వరం జలాలతో పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని కొనియాడారు. సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందడంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలను స్థాపించుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు.ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ఓటును అభివృద్ధి చేసే వారికే వేసి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, కాచం సత్యనారాయణ, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్, చల్లా లక్ష్మీకాంత్, మీలా వంశీ, బెలిదే శ్రీనివాస్, నల్లపాటి శ్రీనివాస్, బిక్కుమళ్ళ సోమేశ్వర్, దారం వెంకన్న, కక్కిరేణి చంద్రశేఖర్, రాచకొండ శ్రీనివాస్, ముప్పారపు నాగేశ్వరరావు , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Nov 19 2023, 16:06