మైనార్టీలకు ఎన్నో పథకాలతో చేయూతనిచ్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండలో తమ మద్దతు బిఆర్ఎస్ పార్టీకేనని తెలిపిన నల్లగొండ MIM ప్రెసిడెంట్
BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు ..
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 0.8% ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు.
కంచర్ల భూపాల్ రెడ్డి హయాంలో కరోనా సమయాన్ని మినహాయిస్తే మిగిలిన రెండుమూడు సంవత్సరాల్లోనే ఇంతలా అభివృద్ధి చెందిందంటే.. మరోదఫా ఎమ్మెల్యేగా పంపిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మైనారిటీల మద్దతు BRSకు ఇస్తున్నామని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు
కోమటిరెడ్డి 20 ఏండ్లు MLA, ఒకసారి మంత్రిగా ఉండి కూడా నల్గొండ అభివృద్ధిని విస్మరించి హైదరాబాద్ లో దాక్కున్నారని, ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి అభివృద్ధి చేస్తా... అవకాశం ఇవ్వాలని కోరడం ఎంత వరకు సబబు అని అన్నారు.
MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. CM KCR ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలల ద్వారా 1,20,000 మంది విద్యార్థులకు విద్య అందించడంతో పాటు షాదీముబారక్, రంజాన్ తోఫా లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
CM KCRగారు మూడోసారి అధికారంలోకి వస్తే
మైనారిటీ సంక్షేమం కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తామని అన్నారు
2014లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు, 2018లో మళ్ళీ ఇప్పుడు నాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ గారలు మాట్లాడుతూ.. BRSకు MIM మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.. 2014 నుంచి BRS, MIM పార్టీల మైత్రీ కొనసాగుతోందని, మరోసారి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే మైనారిటీలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు.
కులమతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లో ముందుకు పోతున్నదని.. అందుకే MIM మద్దత్తు ఇచ్చిందని , వారికి మరోసారి ధన్యవాదాలు అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో.... మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి.. రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఫరీదోద్దీన్ బక్క పిచ్చయ్య, జమాల్ ఖాద్రి అన్వర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, ఎంఐఎం పట్టణ పార్టీ అధ్యక్షులు హజీ,బిఆరెస్ పట్టణ కార్యదర్శి, జాఫర్,సంధినేని జనార్దన్ రావు... ఎమ్ఐఎం జిల్లా ట్రెజరర్ గౌస్ మహమ్మద్ జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ మల్లిక్, సిరాదుద్దీన్, టౌన్ కమిటీ కార్యదర్శి నదీమ్ టౌన్ కమిటీ జాయింట్ సెక్రెటరీ ముదసిర్ తదితరులు పాల్గొన్నారు
Nov 18 2023, 11:32