TS: కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గాంధీభవన్ లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ.. 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో అభయహస్తం మేనిఫెస్టో రూపొందించి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ ల పేరుతో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అభయ హస్తం మేనిఫెస్టోను కూడా జనాల్లోకి తీసుకుకెళ్లనుంది.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:
ప్రతి రోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ ఏర్పాటు
రైతులకు రెండు లక్షలు రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం
మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను పొందుపరిచారు.
ఎంఎన్ఆర్ఇజిఎస్ పనులు వ్యవసాయానికి అనుసంధానం
దళిత, గిరిజనులకు మేలు చేకూర్చేలా మ్యానిఫెస్టో ఉందన్నారు.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు చేపడతాం.
రైతులకు 24గంటలు ఫ్రీ కరెంట్.
కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం.ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం.
ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 వరకూ గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్.
రాష్ట్రంలో కొత్తగా ట్రిపుల్ ఐటీలు నిర్మిస్తాం.
విత్తనాలు, ట్రాక్టర్లు, ఎరువులు కొనుగోలుపై సబ్సీడీ అందిస్తాం.
18ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ.
నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం.
ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్
ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం
ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షల రూపాయల నిధులు
ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10 పాస్ అయితే 10వేలు, ఇంటర్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పాస్ అయితే 25000, పీజీ పాస్ అయితే లక్ష అందజేత
3 ఎస్సీ కార్పొరేషన్ లో ఏర్పాటు ఒక్కొక్క కార్పొరేషన్ కు ఏడాదికి 500 కోట్ల నిధులు
జూన్ 2న నోటిఫికేషన్.. సెప్టెంబరు 17 లోపు ఉద్యోగాల భర్తీ.
నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి
రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం.
రైతు కూలీలకు రూ. 12వేలు ఆర్థిక సాయం
అన్ని పంటలకు మద్దతు ధర
చక్కెర కర్మాగారాలు తెరవడం, పసుపు బోర్డు ఏర్పాటు.
భూమి లేని రైతులకు సైతం రైతు భీమా.
ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన.. యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ
అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు రూ.25 వేలు గౌరవ వేతనం
అమరవీరుల కుటుంబంలో ఒకరికి సర్కార్ కొలువు.
విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం.
ఆరోగ్య శ్రీ పథకం రూ. 10లక్షలకు పెంపు
ప్రతి విద్యార్థికి రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు.
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10వేలకు పెంపు.
ప్రతి మండలానికి మార్కెట్ యార్డ్
వరి ధాన్యం కొనుగోలు తరుగు తొలగింపు
పాల ఉత్పత్తిదారులకు లీటర్కు ఐదు రూపాయలు ప్రోత్సాహకం
సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ అమలు
ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశ వర్కర్లకు వేతనం పెంచి ఉద్యోగ భద్రత
మైనార్టీలకు మైనార్టీ డిక్లరేషన్
పిహెచ్డి ఎం.ఫిల్ పూర్తి చేసిన మైనార్టీలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం
మత బోధకులకు గౌరవ వేతనం 10,000 నుంచి 12,000
నూతన వధువుకు ఒకటి 1.6లక్షలు
ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఐదు లక్షల ఆర్థిక సహాయం
పై వాటితో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు:
1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం
5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్
6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా
అదేవిధంగా బీసీలకు మేలు జరిగేలా పలు అంశాలతో * బీసీ డిక్లరేషన్*
విద్యా పరంగా చూస్తే మండలానికి ఒక గురుకుల పాఠశాల
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు.
పేదింటి ఆడబిడ్డ వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం మరియు 10 గ్రాముల బంగారం.
మరిన్ని వివరాలకు పూర్తి కాంగ్రెస్ మేనిఫెస్టోను సంప్రదించవచ్చు
Nov 18 2023, 08:12