నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర* *సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి
నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర
సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి
నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా గుర్తింపు రావడానికి ఎస్ఎల్ బీసీ నీటి ద్వారానే సాధ్యమని గ్రహించిన కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నేడు నల్లగొండ జిల్లా కొంతమేర అభివృద్ధి జరిగిందని అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని సిపిఎం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు
బుధవారం 1,2,3,18,19 వార్డులలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి సిపిఎం పార్టీ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయమని కోరారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న కమ్యూనిస్టులు నేడు అసెంబ్లీలో లేకపోవడంతో అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాము నియంతృత్వనికి దారి తీస్తుందని అన్నారు కాకతీయులనాడు ఏర్పడ్డ పానగల్లు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ ద్వారా పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పానగల్లులో చేపట్టలేదని ఆరోపించారు. పానగల్లును పర్యాటక కేంద్రంగా మారుస్తామని గొప్పలు చెప్పడం మినహా చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు పానగల్లులో పశుపోషణ గొర్రెల మేకల పెంపుకు దారులు అధికంగా ఉన్నందున ప్రస్తుతం ఉన్న పశు వైద్యశాల ఆధునికరించి 24 గంటలు డాక్టర్లు వైద్య సేవలు అందజే విధంగా ప్రభుత్వంపై పోరాడుతామని హామీ ఇచ్చారు పట్టణ పేదలు కార్మికుల హక్కుల రక్షణ కోసం కనీస వేతనాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం మహిళలు మైనార్టీల రక్షణ కోసం సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సమస్యల పట్ల కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం మాట్లాడుతూ రైతు నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధిలో సాగు త్రాగునీరు సాధన కోసం d39,40,41 పిల్ల కాలువల నిర్మాణం కోసం పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగిన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
*ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్, ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మైల యాదయ్య ఆకిటి లింగమ్మ రుద్రాక్ష శేఖర్ రుద్రాక్ష యాదయ్య దండెంపల్లి దశరథ బుజ్జమ్మ కొండ చంద్రకళ జిట్టా సైదులు దండెం పల్లి సరోజ,భూతం అరుణ, అద్దంకి నరసింహ సలివోజు సైదాచారి , మధుసూదన్ రెడ్డి ,కోట్ల అశోక్ రెడ్డి మారగోని నగేష్ చెనగోని వెంకన్న శ్రావణ్ తరుణ్ కర్నాటి శ్రీరంగం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గoడమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.
Nov 16 2023, 06:38