TS: రాష్ట్రంలో 72 శాతం మంది ఓటర్లు 49 సం. లోపు వారే..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు ఓటర్లు 72 శాతం ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు.
కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
శేరిలింగంపల్లి లో అత్యధిక ఓటర్లు.. భద్రాచలంలో అత్యల్పం
మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు
కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాలవారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు కాగా, మహిళలు 1,63,01,705 ఉండగా ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది ఉన్నారు. ఓటర్లలో 59 ఏండ్లలోపు వారు 86 శాతం ఉన్నట్టు వెల్లడైంది.అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి (7,32,506) నిలిచింది.
ఆ తరువాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,99,130 ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ సంఖ్యలో భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు. ఆ తరువాత అశ్వరావుపేట, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు ఉన్నాయి. 80 ఏండ్లు దాటినవారు 4,40,371, దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన 18, 19 సంవత్సరాల వయస్సు వారు 9,99,667 మంది ఉన్నారు. వీరిలో 5,70,274 పురుషులు కాగా మహిళలు 4,29,273 ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 120 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు అత్యధిక సంఖ్యలో నమోదైన నియోజకవర్గాలలో కూడా మేడ్చల్ (17,012) మొదటిస్థానంలో నిలిచింది.
పురుషులకంటే మహిళలే అత్యధికం
వయస్సుల వారీగా ఓటర్ల వివరాలు
వయస్సు : ఓటర్లు
18-19 : 9,99,667
20-29 : 64,36,335
30-39 : 92,93,392
40-49 : 66,96,089
50-59 : 45,66,306
60-69 : 27,72,128
70-79 : 13,98,511
80+ : 4,40,371
మొత్తం : 3,26,02,799
అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు
నియోజకవర్గం : ఓటర్లు
భద్రాచలం : 1,48,661
అశ్వరావుపేట : 1,55,961
బెల్లంపల్లి : 1,73,335
చెన్నూరు : 1,88,283
వైరా : 1,93,069
బాన్సువాడ : 1,95,191
దుబ్బాక : 1,98,100
పినపాక : 1,98,402
జుక్కల్ : 1,99,962
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు
నియోజకవర్గం : ఓటర్లు
శేరిలింగంపల్లి : 7,32,506
కుత్బుల్లాపూర్ : 6,99,130
మేడ్చల్ : 6,37,839
ఎల్బీ నగర్ : 5,93,712
రాజేంద్రనగర్ : 5,81,937
మహేశ్వరం : 5,46,577
ఉప్పల్ : 5,29,416
మల్కాజిగిరి : 4,89,043
కూకట్‌పల్లి : 4,63,864
పటాన్‌చెరు : 3,97,237
18, 19 ఏండ్ల వారు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు
నియోజకవర్గం : యువ ఓటర్లు
మేడ్చల్ : 17,012
కుత్బుల్లాపూర్ : 15,117
రాజేంద్రనగర్ : 14,094
మహేశ్వరం : 14,039
ఖమ్మం : 13,599
ఎల్బీనగర్ : 12,569
మునుగోడు : 12,523
గద్వాల : 12,385
ఇబ్రహీంపట్నం : 12,757
వనపర్తి : 12,073
80 ఏండ్లు దాటిన వారు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్లు
నియోజకవర్గం : ఓటర్లు
మల్కాజిగిరి : 10,128
ఎల్బీనగర్ : 8,478
శేరిలింగంపల్లి : 8,102
మలక్‌పేట : 7,871
ఉప్పల్ : 7,553
మహేశ్వరం : 7,019
ముషీరాబాద్ : 6,780
కంటోన్మెంట్ : 6,395
యాకత్‌పుర : 6,201
సనత్‌నగర్ : 5,931
దివ్యాంగులు అధికంగా ఉన్న నియోజకవర్గాలు
నియోజకవర్గాలు : ఓటర్లు
కోరుట్ల : 11,530
ధర్మపురి : 11,102
జగిత్యాల : 9,759
మహేశ్వరం : 8,362
మానకొండూరు : 7,009
హుజూరాబాద్ : 6,931
మేడ్చల్ : 7,405
ఇబ్రహీంపట్నం : 7,322
వనపర్తి : 6,382
ఎల్బీనగర్ : 6,064
Nov 15 2023, 18:29