నల్లగొండ: ఎన్జీ కళాశాలలో ఘనంగా 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో, జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా.. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు ముఖ్య అతిథిగా గోన రెడ్డి కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్నటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ పరిశోధన, దిన పత్రికలు మరియు రిఫరెన్స్ పుస్తకాలు, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ను విద్యార్థులు పోటీ పరీక్షల కోసం వినియోగించుకొని జాతీయస్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో విద్యని కొనసాగించాలని తెలిపారు.
ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య కన్వీనర్ ఎం.వి. గోన రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయంలో సాహిత్యం, టెక్నాలజీ కి సంబంధించిన పుస్తకాలు.. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు మరియు అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని.. విద్యార్థులు ప్రింటు సమాచారంతో పాటు డిజిటల్ లైబ్రరీ ద్వారా సమాచారాన్ని వినియోగించుకొని కెరీర్లో విజయం సాధించాలని అన్నారు. కళాశాల గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించారు.
కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాల గ్రంథాలయంలో 62 వేలకు పైగా టెక్స్ట్ మరియు రిఫరెన్స్ బుక్స్ అందుబాటులో ఉన్నాయని, కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్ లైబ్రరీలో సమాచారాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
నేడు పుస్తక ప్రదర్శన కార్యక్రమం, ఈ నెల 15న బుక్ రివ్యూ/రీడతన్ కార్యక్రమం, 16న వ్యాసరచన పోటీ యువత గ్రంథాలయాల ఉపయోగం- గ్రంథాలయాలు మరియు వాటి ప్రాధాన్యత, 17న భారత ఎన్నికల వ్యవస్థ పైన వక్తృత్వ పోటీ, 18న వ్యక్తిత్వ వికాస ఉపన్యాసం, 19న జాతీయస్థాయిలో ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్, 20న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో భాగంగా వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు, రిసోర్స్ పర్సన్స్ లకు.. బుక్స్ మరియు సర్టిఫికెట్ లు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ యాదగిరి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, లవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, డాక్టర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, డాక్టర్ ఎన్ దీపిక, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ ఎన్ వేణు, డాక్టర్ నారాయణరావు ,చంద్రయ్య , కనకయ్య, మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, గ్రంథాలయ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు.
Nov 14 2023, 22:21