NLG:సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన 5గురు క్రీడాకారులు
నల్లగొండ: నేటి నుండి ఈ నెల 14 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ JNTU యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు నల్గొండ చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ చెందిన 4గురు క్రీడాకారులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కబడ్డీ జట్టు తరఫున మరియు KL యూనివర్సిటీ జట్టు తరపున ఒక్కరు మొత్తం 5గురు క్రీడాకారులు ఎంపికైనారని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ జట్టు తరఫున, ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ అందిస్తున్న సహకారంతో కుంటిగొర్ల కోటేష్, చింత రవితేజ, మరియు హాలియా ప్రభుత్వ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న పేర్ల మధు, దుగ్యాల సందీప్ లు ఎంపికైనారని, వీరందరూ ప్రస్తుతం హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి కబడ్డీ అకాడమీలో శిక్షణ పొందుతున్నారని, మరియు పిల్లి భరత్ హైదరాబాద్ KL యూనివర్సిటీ నందు
BCA చదువుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైనారని, వీరందరూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ లైన శ్రీనివాసరావు, భాస్కరరావు ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం కబడ్డీ క్రీడలో శిక్షణ పొందుతూ, చదువులో మరియు జాతీయస్థాయి కబడ్డీ క్రీడల్లో రాణిస్తూ మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని బొమ్మపాల గిరిబాబు తెలియజేశారు.
Nov 10 2023, 21:56