/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz చండూర్: భారీ జన సమూహంతో ర్యాలీగా వచ్చి.. నామినేషన్ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి Mane Praveen
చండూర్: భారీ జన సమూహంతో ర్యాలీగా వచ్చి.. నామినేషన్ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి చండూరు పట్టణ కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంగడిపేట నుండి కొనసాగిన ఈ బైక్ ర్యాలీ లో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూసుకుంట్ల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండూరు లో ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. అనంతరం చండూరు చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి పనులు చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి చండూరు పట్టణ కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంగడిపేట నుండి కొనసాగిన ఈ బైక

'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షులు నాగిల్ల మారయ్య ఏర్పాటు చేసిన సమావేశం లో 'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈనెల 14న చండూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ జిల్లా వెంకటేష్ మాదిగ మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు ఇంచార్జి ఎమ్ ఎస్ ఎఫ్ జాతీయ నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికలలో బహుజన వాదాన్ని వినిపించడానికి, పల్లె పల్లెకు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ పనిచేస్తుందని, బీసీ ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, అగ్ర వర్ణ పేదల ను ఏకం చేస్తూ.. ప్రధాన పార్టీలకు దీటుగా గ్రామస్థాయి నుండి మన ఓటు మనమే తీసుకోవాలని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, సురేష్, రాములు, నరసింహ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

NLG: చిట్యాల మండలంలో ఉవ్వెత్తున సాగుతున్న బీఎస్పీ ప్రచారం

నకిరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా.. చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ప్రజలు బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చిట్యాల మండలానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి మోసాలను ప్రజలు ఆమె కు చెప్పడం జరిగింది. ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటేస్తామని ఆయా గ్రామాల ప్రజలు ఆమెకు హామీ ఇస్తున్నారు. ప్రచారంలో బాగంగా ప్రజలనుద్దేశించి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలంటే, చిట్యాల మండలంలోని గ్రామాలు అభివృద్ధి జరగాలంటే మండలానికి కార్పొరేట్ స్థాయి పాఠశాల రావాలంటే మరియు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ రావాలంటే.. బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రియదర్శిని ప్రజలను కోరారు.

ప్రజలు గత పాలన మీద ప్రజలు విసుగు చెంది బీసీ,ఎస్టీ,ఎస్సీ మైనార్టీ పేదలంతా ప్రత్యామ్నాయ పార్టీగా బిఎస్పికి వైపు చిట్యాల మండలంలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య,మండల అధ్యక్షులు జోగు శేఖర్,యోగి, కృష్ణ, మల్లేష్, మహేష్ బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చండూరు: ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చందు నాయక్

నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో.. మర్రిగూడెం మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన మెగావత్ చందు నాయక్, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం చండూరు మండల కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గెలిపిస్తే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు.

రేపు గురువారం నామినేషన్ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. రేపు గురువారం నవంబర్ 9న, ఉదయం 11 గంటలకు చండూరు మండల కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేయనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆశీస్సులతో, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దీవెనలతో, నియోజకవర్గ ప్రజల మద్దతుతో నామినేషన్ వేయడం జరుగుతుంది, కావున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ భారీ బైక్ ర్యాలీ తో చండూరు దగ్గర ఉన్న అంగడిపేట వద్దకు ఉదయం 11 గంటల లోపు చేరుకొని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

TS: రేపు నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికలు 2023 సందర్భంగా.. గజ్వేల్‌ మరియు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు.. రేపు నవంబర్‌ 9 గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు గజ్వేల్‌ లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగిస్తారు.

యరగండ్లపల్లి: బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ వార్డు మెంబర్లు

NLG: మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి వార్డు మెంబర్లు రమేష్, స్వామి, మరికొంతమంది గ్రామ యువకులు ఈరోజు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికలవేళ మాలలను అనిచివేసి ప్రయత్నం జరుగుతుంది: నాగిళ్ల మారయ్య

నల్గొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో బుధవారం మర్రిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాల సోదరులు, విద్యావంతులు, మేధావులు, వివిధ హోదాలో పనిచేసినటువంటి సోదరులారా ఆలోచన చేయండి. మన ముందు భవిష్యత్తులో పెద్ద ఉప్పెన ఉంది. ఎన్నికలవేళ మాలలను అనిచివేసే ప్రయత్నం జరుగుతుంది. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వర్గీకరణ అంశం మళ్ళీ తెరపైకి తెచ్చి ప్రభుత్వాలు గద్దె ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ప్రభుత్వాలకు మాలలు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. వర్గీకరణ జరిగితే మన బ్రతుకులు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక వర్గానికి మద్దతిస్తూ మరొక వర్గాన్ని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఒకే ఒక విషయం చెప్తున్న మీ ప్రభుత్వాలు నడవడానికి మాల ముఖ్య సలహాదారులు కావాలి కానీ, మాకు నాయకత్వం వహించే హక్కు లేదు, ఎందుకంటే మేము సలహాలు ఇస్తే మీరు రాజ్యమేలుతారు కదా, ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ధర్మం వైపు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ మహానీయుడు కలలు కన్నా స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ప్రసాద్ ఈద అభి సందేశ్, వంపు చరణ్, శివరాజ్, కోరే అజయ్, తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ పట్టణంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం భారీ సంఖ్యలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు నల్లగొండకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. 

అశేష జనంతో కోమటిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పెద్ద గడియారం సెంటర్లో రోడ్ షో నిర్వహించి, చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తాను తృణప్రాయంగా వదిలేశానని అన్నారు. ఏ హోదాలో ఉన్నా నల్లగొండ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అని విమర్శించారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో వేలాదిమంది యువతీ యువకులు, మహిళలు, పురుషులు, కోలాటం కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

భారీ జన సమూహంతో బిఎస్పి శ్రేణుల మధ్య నామినేషన్ వేసిన మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం

బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ముందుగా నకిరేకల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జిగా ఉంటూ.. ప్రతి ఒక్క ప్రజా సమస్యలపై ప్రజలకు మద్దతుగా ఉంటూ పోరాటం చేయడం జరుగుతుంది అన్నారు. 

ప్రతి గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు తిరుగుతూ ఉంటే ప్రజలు ఏనుగు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వర్గ పోరు తప్ప ప్రజా సమస్యల పైన పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగమే మేనిఫెస్టో ఉండే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ విద్యా ,వైద్యం ,ఉపాధి ఉండే విధంగా కృషి చేస్తాను. ప్రజల పక్షాన ఉంటానని ఒకసారి ఏనుగు గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకురాలు మర్రి శోభ, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, వివిధ మండల అధ్యక్షులు మండల కమిటీ లు బూత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.