ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు చేసిన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి
నేడు..నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా.. కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. నామినేషన్ దాఖలు...
ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు...
రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కంచర్ల....
ఉదయం తమ స్వగ్రామం ఉరుమడ్ల గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు...
సరిగ్గా ఉదయం 9.20 గంటలకు...
కుటుంబ సభ్యులు, సోదరీమణులు... మంగళ హారతులు పట్టి విజయ తిలకం దిద్దగా.. మాతృమూర్తి కౌసల్య, సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకున్న... భూపాల్ రెడ్డి గారు... ముఖ్య నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు వెంటరాగా...తాను నివాసముంటున్న... బీటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... ప్రత్యేక పూజలు నిర్వహించారు... అనంతరం తన ఇష్ట దైవం... రామలింగేశ్వరుడికి ఛాయా సోమేశ్వరాలయంలో... అభిషేకం నిర్వహించి పూజలు చేశారు...
ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డివో కార్యాలయం చేరుకొని
నిబంధనల మేరకు ఐదుగురు.. నాయకులు వెంట రాగా.. నల్లగొండ నియోజకవర్గ ఆర్ వో గారికి.. రుసుము చెల్లించి.. నామినేషన్ పత్రం అందచేశారు...
అనంతరం వెలుపల మీడియా తో మాట్లాడుతూ..
# నల్లగొండ పునర్నిర్మాణం కోసం ఆలోచనతో ఓటు వేయండి..
#అభివృద్ధిని కొనసాగించేందుకు మరోసారి అవకాశం ఇవ్వండి.
# కడుపు నింపే కేసీఆర్ కావాలా కడుపు కొట్టి కాంగ్రెస్ కావాలో నిర్ణయించుకోండి.
# కోమటిరెడ్డిని తరిమేస్తేనే నల్లగొండలో ఖాళీ జాగాలు మిగులుతాయి.
# ఐదేళ్లు కనపడని కోమటిరెడ్డి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి నాయకులను కొనుగోలు చేస్తుండు.
.... కంచర్ల.
గత 20 ఏళ్లుగా గోస తీసి.. అభివృద్ధి కి నోచుకోక... ఇప్పుడిప్పుడే నల్లగొండ నిర్మాణం చెందుతూ అభివృద్ధి దిశ వైపు పరుగులు తీస్తుంటే... గత ఐదు సంవత్సరాలుగా కనపడని.. నల్లగొండ ప్రజల సమస్యలు పట్టని పట్టించుకోని.. కోమటిరెడ్డి మళ్లీ డబ్బు సంచులతో వచ్చి.. నాయకులను కొనుగోలు చేసి...
హైప్ క్రియేట్ చేసి... ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నాడ ని.. గతంలోల ఆయన మాటలు ఇప్పుడు సాగవని.. ఆయన మాయ మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు... కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని.. వాటిని మరింత పెంచుతూ మేనిఫెస్టోలో తెలిపిందని
ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 కు దివ్యాంగుల పెన్షన్ 6016 రైతుబంధు 12 వేల నుండి 16 వేలకు.. 3016 రూపాయల సౌభాగ్య లక్ష్మి... 400 రూపాయలకే సిలిండర్.. తదితర ప్రజలకు ఉపయోగపడే లాభపడే.. పథకాలు ప్రవేశపెట్టనిందని... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడి తెచ్చిన కేసీఆర్ ద్వారానే ఈ పనులన్నీ... నెరవేరుతాయని...
ప్రజలకు తెలియజేశారు.
కంచర్ల నామినేషన్ కార్యక్రమంలో..
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీం పాషా జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంజి యూనివర్సిటీ సినీనటి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలిమా అమరేందర్ రెడ్డి జేఏసీ అధ్యక్షులు జే వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు నేతి రఘుపతి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జెడ్పి కోఆప్షన్ సభ్యులు.. తీగల జాన్ శాస్త్రి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ,జమాల్ ఖాద్రి రంజిత్ ఉద్యమ నాయకులు బక్క పిచ్చయ్య మాలే శరణ్య రెడ్డి సింగం రామ్మోహన్, లక్ష్మి, ఫరీద్ దొద్దిన్ మైనం శ్రీనివాస్,
పెఱిక ఉమామహేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవరెడ్డి ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్,తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్రెడ్డి దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య..
తిప్పర్తి కనగల్ మాడులపల్లి నల్లగొండ వైస్ ఎంపీపీలు.. ఏనుగు వెంకట్ రెడ్డి రామగిరి శ్రీధర్ రావు, రామగిరి శ్రీధర్ రావు, జిల్లా పరమేష్... సింగిల్ విండో వైస్ చైర్మన్ లు, కందుల రేణుక లక్ష్మయ్య, తవిటి కృష్ణ...
పట్టణ మండలం పార్టీ.కార్యదర్శులు సందినేని జనార్ధన్ కాసం శేఖర్,జాఫర్,వనపర్తి నాగేశ్వరరావు కందిమల్ల నరేందర్ రెడ్డి, ఇరుగంటిపల్లి శేఖర్ రెడ్డి,బడుపుల శంకర్, పలువురు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Nov 09 2023, 15:27