బ్రేకింగ్ న్యూస్* నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్
బ్రేకింగ్ న్యూస్
నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్
#మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నాయకులు
#సీనియర్ కాంగ్రెస్ నేత తండు సైదులు గౌడ్ బి ఆర్ యస్ లో చేరిక
#అదే బాటలో మాజీ జడ్ పి టి సి తుమ్మల లింగస్వామి యాదవ్, నల్లగొండ యం పి పి వైస్ ప్రెసిడెంట్ జిల్లా పరమేష్ తదితరులు.
నల్లగొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకీ భారీ షాక్ తగిలింది.నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకీ రాజీనామాలు చేసి గులాబీ గూటికి చేరారు.పార్టీలో చేరిన వారిలో ఆ పార్టీ సీనియర్ నేత తిప్పర్తి మాజీ జడ్ పి టి సి తండు సైదులు గౌడ్,నల్లగొండ మండల వైస్ యం పి పి పరమేష్ మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు తదితరులు గులాబీ గూటికి చేరారు.హైదరాబాద్ లో బి ఆర్ యస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక మరియు ఐటీ మంత్రి కలువకుంట్ల తారకరామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరుల సమక్షంలో బి ఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన నేతలకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్హనించారు.పార్టీలో చేరిన తండు సైదులు గౌడ్ తిప్పర్తి సర్పంచ్ గా జడ్ పి టి సి గా విధులు నిర్వహించారు.అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు తండు నరసింహా గౌడ్ సర్వారం మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు,పైడిమర్రి మాజీ యం పి టి సి వెంకట్ రెడ్డి,దర్వేశ్ పురం మాజీ చైర్మన్ పాలకూరి గణేష్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ యస్ సి సెల్ అధ్యక్షుడు పాల్వాయి సాగర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరం చల్లా రెడ్డి,తిప్పర్తి గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు నకరబోయిన శ్రీను,బుద్దారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ముప్ప మురళీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లికంటి గంగయ్య,యాపల గూడెం ఉప సర్పంచ్ నక్కా సైదులు,దున్న లతీఫ్,ఎమ్ ఆర్ పి యస్ తిప్పర్తి అధ్యక్షుడు బొజ్జ ఎల్లయ్య,కారింగుల నరేష్ గౌడ్,పల్లె శేఖర్ ,బొంత యాదయ్య, బొంత అంజయ్య, తుమ్మల సైదులు ,దేవురపల్లి మహేష్ రెడ్డి,చింతకుంట్ల చంద్రం,గుర్రం శ్రీనివాస్ రెడ్డి,జక్కలి మల్లేష్ యాదవ్,కొండేటి అంజి,పాలడుగు లింగస్వామి,మందడి మధుసూదన్ రెడ్డి,ఇళ్లేందుల శివ శంకర్, చెదురుపల్లి ప్రకాష్,అలకుంట్ల రమేష్ తదితరులు ఈ రోజు బి ఆర్ యస్ లో చేరిన వారిలో ఉన్నారు.
Nov 09 2023, 14:52