ఎన్నికలవేళ మాలలను అనిచివేసి ప్రయత్నం జరుగుతుంది: నాగిళ్ల మారయ్య
నల్గొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో బుధవారం మర్రిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాల సోదరులు, విద్యావంతులు, మేధావులు, వివిధ హోదాలో పనిచేసినటువంటి సోదరులారా ఆలోచన చేయండి. మన ముందు భవిష్యత్తులో పెద్ద ఉప్పెన ఉంది. ఎన్నికలవేళ మాలలను అనిచివేసే ప్రయత్నం జరుగుతుంది. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వర్గీకరణ అంశం మళ్ళీ తెరపైకి తెచ్చి ప్రభుత్వాలు గద్దె ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వాలకు మాలలు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. వర్గీకరణ జరిగితే మన బ్రతుకులు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక వర్గానికి మద్దతిస్తూ మరొక వర్గాన్ని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఒకే ఒక విషయం చెప్తున్న మీ ప్రభుత్వాలు నడవడానికి మాల ముఖ్య సలహాదారులు కావాలి కానీ, మాకు నాయకత్వం వహించే హక్కు లేదు, ఎందుకంటే మేము సలహాలు ఇస్తే మీరు రాజ్యమేలుతారు కదా, ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ధర్మం వైపు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ మహానీయుడు కలలు కన్నా స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ప్రసాద్ ఈద అభి సందేశ్, వంపు చరణ్, శివరాజ్, కోరే అజయ్, తదితరులు పాల్గొన్నారు
Nov 08 2023, 22:25