వాట్సాప్‌లో మెసేజ్ చేసినా వెళ్లడం లేదా.. కారణమిదేనేమో!
వాట్సాప్‌లో మెసేజ్ చేసినా వెళ్లడం లేదా.. కారణమిదేనేమో!
ఓ సారి చెక్ చేసుకోండి..
మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఎవరికైనా మెసేజ్ లేదా కాల్స్ చేసినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వారు మీ వాట్సాప్‌ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం వీటి ఆధారంగా బ్లాక్ చేశారని నిర్ధారించడం కూడా కష్టమే. ఎందుకంటే వాట్సాప్‌లో కొన్ని ఫీచర్లు వినియోగదారుల ప్రైవసీని కాపాడే క్రమంలో
వాట్సాప్.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా యాజమాన్యంలో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం సమాచార మార్పిడికి వాట్సాప్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది. విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ అందరికీ వాట్సాప్ అవసరం కాదు అనివార్యమైపోయింది. అంతలా అందులోని ఫీచర్లు జనాలకు కనెక్ట్ అయ్యాయి. అయితే వాట్సాప్ అకౌంట్ ప్రతి ఒక్కరితోనూ మీరు చాట్ చేయొచ్చు. కాకపోతే వారి నంబర్ మీ వద్ద ఉండి తీరాలి. అయితే కొంతమంది మీ నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేస్తారు. ఆ విషయం మీకు అర్థంకాకపోతే వాట్సాప్ ఏదో సమస్య అని పొరబడుతుంటారు. సాధారణంగా బంధువర్గంలోనో, స్నేహితుల్లోనో కొన్ని సందర్భాల్లో తరచూ మనం చాట్ చేసే వ్యక్తులు మన నంబర్ను బ్లాక్ చేస్తే విషయం మొదట అర్థం కాదు. మరి మనల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే దానిని మనం ఎలా గుర్తించాలి? అందుకు ఏమైనా ప్రత్యేకమైన మార్గాలున్నాయా? తెలుసుకుందాం రండి..
ఇలా తెలుసుకోవచ్చు..
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కచ్చితమైన మార్గం లేనప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కొన్ని అంశాలు మనకు సహకరిస్తాయి. అవేంటంటే..
లాస్ట్ సీన్ కనిపించదు.. మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్‌లో బ్లాక్ చేస్తే..వారు చివరిసారిగా వాట్సాప్ చూసిన సమయం అదేనండి లాస్ట్ సీన్‌ను మీరు చూడలేరు. అది మీకు హైడ్ అయిపోతోంది. ఎందుకంటే బ్లాక్ చేసిన వ్యక్తి గోప్యతను కాపాడటానికి ఈ సమాచారాన్ని కనిపించకుండా చేస్తుంది.
‘ఎస్బీఐ చాక్లెట్ ప్యాక్’ విధానం గురించి తెలుసా? రుణ గ్రహీతలకు ఇంటికొచ్చి మరీ చాక్లెట్ ఇస్తారు.. పూర్తి వివరాలు ఇవి..
ప్రొఫైల్ ఫొటో కనపడదు.. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ ఫొటోలను కూడా మీరు చూడలేరు. కొత్తగా ఏదైనా ప్రొఫైల్ ఫొటో మార్చితే అది కూడా మీకు తెలియదు. ఇది కూడా వారి ప్రైవసీ కోసం పెట్టిన ఫీచర్.
బ్లూటిక్స్ కనపడవు.. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఏదైనా మెసేజ్ పంపితే వారికి చేరదు. మీరు మెసేజ్ పంపినప్పుడు ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది కానీ అవతలి వ్యక్తికి అది చేరదు. అందువల్ల బ్లూ టిక్ మార్క్ అనేది ఎప్పటికీ రాదు. ఒక చెక్ గీత మాత్రమే మీకు కనిపిస్తుంది. మీరు పంపిన మెసేజ్ అవతలి వ్యక్తికి చేరకుండా వాట్సాప్ బ్లాక్ చేస్తుంది.
కాల్స్ వెళ్లవు.. మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసిన వ్యక్తికి వాట్సాప్ కాల్ చేయలనుకుంటే ఆ కాల్ మీకు కనెక్ట్‌కాదు. ఎంత ట్రై చేసిన కాల్ వెళ్లదు. ఇదికూడా వాట్సాప్ నిరోధిస్తుంది.
మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఎవరికైనా మెసేజ్ లేదా కాల్స్ చేసినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వారు మీ వాట్సాప్‌ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం వీటి ఆధారంగా బ్లాక్ చేశారని నిర్ధారించడం కూడా కష్టమే. ఎందుకంటే వాట్సాప్‌లో కొన్ని ఫీచర్లు వినియోగదారుల ప్రైవసీని కాపాడే క్రమంలో వీటిని నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఎవరైనా వాట్సాప్‌లో తాను చివరిసారిగా చూసిన అంటే లాస్ట్ సీన్‌ని డిసేబుల్ చేసి ఉంటే వారి లాస్ట్ సీన్ మీకు కనిపించదు. లేదా వారి ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలు ఉన్నా లాస్ట్ సీన్ మీకు కనిపించకపోవచ్చు. కాబట్టి పైన పేర్కొన్ని అన్ని సంకేతాలను బట్టి.. క్రాస్ చెక్ చేసుకొని బ్లాక్ చేశారని నిర్ధారించుకోవడం ముఖ్యం.
Nov 03 2023, 21:31