అమరవీరుల పోరాట స్పూర్తితో.. సమసమాజం కోసం పోరాడుదాం: CPI (M-L) న్యూడెమోక్రసీ
నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ ఇచ్చిన పిలుపుతో భాగంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో పార్టీ పట్టణ కార్యదర్శి బొమ్మిడి నగేష్,రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు సత్తిరెడ్డి లు ఎర్రజెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని, ఉద్యోగాలని, కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డిపోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరవీరుల స్పూర్తితో దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దాసరి నర్సింహా, జానపాటి శంకర్, బి.వి చారి, బొమ్మపాల అశోక్, మామిడాల ప్రవీణ్,,అంజి,లింగయ్య,అశోక్, రాజు,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.
Nov 03 2023, 15:44