ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా పాటలను రిలీజ్ చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు..
ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా పాటలను రిలీజ్ చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వీధుల్లో పార్టీలకు సంబంధించిన పాటల మోత మోగుతోంది. తెలంగాణకు పాటలతో విడదీయలేని బంధం ఉంది.. తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి దశ ఉద్యమం దాకా పాటలతోనే రాష్ట్ర పోరాటానికి ఊపిరి పోసింది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వీధుల్లో పార్టీలకు సంబంధించిన పాటల మోత మోగుతోంది. తెలంగాణకు పాటలతో విడదీయలేని బంధం ఉంది.. తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి దశ ఉద్యమం దాకా పాటలతోనే రాష్ట్ర పోరాటానికి ఊపిరి పోసింది పాట.
పాటల ప్రాముఖ్యతను చాటుతూ ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలలోకి వెళ్లాయి. ప్రస్తుతం పాట నేడు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రజలకు దగ్గరవడానికి పాటనే ప్రధాన అస్త్రంగా నమ్ముకున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మేనిఫెస్టో ప్రచారం కోసం అధికార పార్టీ పాటల్లో రిలీజ్ చేస్తూ ఉంటే.. ప్రభుత్వ వైఫల్యాలను అవినీతిని ఎండకడుతూ ప్రతిపక్షాలు కూడా పాటలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి అయిదారు పాటలను విడుదల చేస్తున్నారు. సమస్యలను గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లో పాటలతో హోరెత్తిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ జెండాలే రామక్క అని పాటను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చేస్తుంది గులాబి పార్టీ. అయితే అభ్యర్థులు అదే పాటను మార్చిన ప్రతిపక్ష పార్టీలు సర్కార్ చేయని పనులు ఇతర ఇతర సమస్యలపై పాటల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన గులాబీల జెండాలే రామక్క అనే పాట ఎన్నికల ప్రచారంలో విపరీతంగా దూసుకెళ్లింది.. పార్టీ ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట భాగా వినిపిస్తోంది. పాలమూరు జిల్లా కలల ప్రాజెక్టు అయినటువంటి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు, కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ప్రవేశపెట్టిన పథకాలను పొగుడుతున్నట్లుగా ఈ పాట సాగింది. ఈ పాట విపరీతంగా ప్రజల్లోకి దూసుకెళ్తోంది.
వెంటనే అలెర్ట్ అయిన ప్రతిపక్షాలు ఇదే పాటను ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి కుటుంబ పాలనను ప్రశ్నిస్తూ సెటైరికల్‌గా మరో పాటను రిలీజ్ చేశాయి. ఈ పాట బాగా వైరల్ అయింది. ఈ విధంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల పాటల జోరు ప్రజల్లోకి విపరీతంగా వెళుతున్నాయి. ఈ విధంగా ఒకొక్క అభ్యర్థి మూడు నుండి ఐదు పాటలను తమ నియోజకవర్గాలలో పాటల మార్చుకుని ముందుకెళుతున్నారు.
Nov 03 2023, 10:19