నల్గొండ లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, వ్యాయామ విద్యా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని "జాతీయ ఐక్యత దినోత్సవం" నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్ ఉపేందర్ ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ప్రక్కకు పెట్టి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పటేల్ యొక్క దేశ సేవలను గుర్తు చేసుకొని, నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. విద్యార్థులు ఐకమత్యంగా ఉండి, దేశ సమగ్రతను, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం కావాలని, భారత దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వయంగా కదిలి సత్యనిష్టతో ముందుకెళ్లాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చేత "ఐక్యత ప్రతిజ్ఞ" చేయించారు. తదనంతరం "రన్ ఫర్ యూనిటీ" అనే పరుగును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు ఇ.యాదగిరి రెడ్డి, ఎమ్. వెంకట్ రెడ్డి,కే.శివరాని,ఫిజికల్ డైరెక్టర్ కే.మల్లేశ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
Nov 01 2023, 23:10