NLG: ఎన్జీ కళాశాలలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు జాతీయ సేవా పథకం( ఎన్ఎస్ఎస్) యూనిట్ల ఆధ్వర్యంలో.. బుధవారం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబర్ క్రైమ్ నల్లగొండ విభాగ డీఎస్పీ టి.లక్ష్మినారాయణ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను గురించి వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో సూచించారు. ఒకవేళ వాటి బారిన పడితే ఏ విధంగా న్యాయం పొందాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ.యాదగిరి రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి, ఎన్.వేణు, ఎస్.యాదగిరి, కె.శివరాణి, లైబ్రేరియన్ ఏ.దుర్గాప్రసాద్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు



నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు గా విధులు నిర్వహిస్తున్న రేఖ వెంకటేశ్వర్లు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 83 వ స్నాతకోత్సవం లో ఫిజిక్స్ సబ్జెక్టు నందు పీహెచ్డీ స్నాతక అవార్డును మంగళవారం హైదరాబాదులో ఓయూ వీసీ రవీందర్, Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతులమీదుగా అందుకున్నారు. వారు ప్రో. ఏ.సదానందచారి పర్యవేక్షణ లో 'నానో విక్షేపిత సూపర్ అయానిక పదార్థాల విద్యుత్ వాహకత్వం' పై అధ్యయనం చేశారు. 









Nov 01 2023, 22:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k