సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి..
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి
AITUC ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించిన నాయకులు
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని అందుకు సింగరేణి సివిల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్ సివిల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం నాడు కార్పొరేట్ సివిల్ డివైజియం శ్రీ పి రాజశేఖర్ గారికి ఏఐటీయుసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య లు కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం పెరిగిన డిఏ బాపతు ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ల ద్వారా మరియు సింగరేణి కంపెనీ డైరెక్టుగా చెల్లించాల్సి ఉన్నది.వాటిని కొందరికి చెల్లించి ఇంకా అనేక మందికి చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆందోళన చెందుతున్నారని తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు సింగరేణి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి శ్రీను,కిరణ్, అజయ్,పెద్దబాబు,సూర్య, బి,సైదుబాబు,నీలకంఠం,శంకర్,సవీన్ తదితరులు పాల్గొన్నారు.
Nov 01 2023, 09:45