కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి..
కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి
ఉమ్మడి జిల్లాలో రెడ్ల కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ
బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే రెబల్ గానైన పోటీ చేస్తా
మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు,పండ్లు బ్రేడ్లు పంపిణీ
కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించడంలేదని ఆ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 శాతానికి పైగా ఉన్న బీసీలను కాదని, జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల వారికే పార్టీ స్థానం కల్పిస్తుందని, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి ఆ స్థాయిలో అవకాశాలు కల్పించడంలేదని అన్నారు. ఇతర పార్టీలు బీసీలను గుర్తించి ఎమ్మెల్యే , ఎంపిల సీట్లను ఇస్తుంటే కాంగ్రెస్ లో కేవలం రెడ్డిలు రాజ్యమేలుతున్నారని, దీనిని గమనించి మూడవ విడత అభ్యర్థుల ఎంపికలో బీసీ సీనియర్ నాయకులకు టిక్కెట్ లను కేటాయించాలన్నారు.సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు లేదని అన్నారు .బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.
Oct 31 2023, 18:39