ప్రజా వ్యతిరేక బీజేపీ, బిఆర్ఎస్ లను ఓడించండి: ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
నల్లగొండ: జాగో (మేలుకో) తెలంగాణ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (TELANGANA STATE DEMOCRATIC FORUM (TSDF) సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కొరకు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో "ఓటర్ల చైతన్య యాత్ర" బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఉదయం ఎన్జీ కళాశాల, అంబేద్కర్ విగ్రహం (డిఇఓ ఆఫీస్), పెద్ద గడియారం సెంటర్, జిల్లా గ్రంధాలయం లో నిరుద్యోగులతో సభలు నిర్వహించారు.
ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో ఆకునూరి మురళి మాజీ కలెక్టర్, జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వం తో, దోపిడీ చేస్తున్న బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు.
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి చలపతిరావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో అభ్యర్థులను నిలదీయాలని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని, రైతు రుణమాఫీ, దళిత బంద్, కౌలు రైతులకు హార్దిక సహాయం, పంటల బీమా, ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ లు,15 లక్షల నల్లధనం, అంశాలపై పాలకులను నిలదీయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని లక్ష ఎకరాలకైనా అందించారా అని ప్రశ్నించారు. బడా కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని తెలిపారు.
దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సలహాదారు ప్రొ. వినాయక్ రెడ్డి Rtd (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్), టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, ఎం. హన్మేశ్ (TSDF కో కన్వీనర్) , నైనాల గోవర్ధన్ (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యక వేదిక సమన్వయకర్త), ప్రదీప్ PYL రాష్ట్ర నాయకులు, రాజ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ OU విద్యార్థి సంఘం నాయకులు, ఇందూరు సాగర్ (ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు), PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్, బొంగరాల నర్సింహా, AIKMS జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల సైదులు, కళాకారులు బాల నరసయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Oct 30 2023, 22:08