NLG: రేపు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డు తీసుకోనున్న ఎన్జీ కళాశాల అధ్యాపకులు
రేపు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా నల్లగొండలోని నాగార్జున కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ తీసుకోనున్నారు.
డాక్టర్.సయ్యద్ మునీర్- చరిత్రలో , డాక్టర్.ఆనందం దుర్గాప్రసాద్ -గ్రంధాలయ సమాచార శాస్త్రంలో, డాక్టర్.శీలం యాదగిరి-రాజనీతి శాస్త్రంలో, డాక్టర్.గంజి భాగ్యలక్ష్మి- జంతు శాస్త్రంలో, డాక్టర్.నాగుల వేణు- ప్రభుత్వ పాలన శాస్త్రంలో, డాక్టర్.టి.సైదులు -తెలుగు సబ్జెక్టులో డాక్టరేట్ అవార్డు అందుకోబోతున్నారని, కళాశాల నుంచి ఆరుగురు అధ్యాపకులు ఒకే సంవత్సరంలో డాక్టర్ అవార్డు పొందడం హర్షం వ్యక్తం చేస్తూ, తద్వారా కళాశాలలో విద్యార్థులలో పరిశోధన అభివృద్ధి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉందని, జిజ్ఞాస ప్రాజెక్టులు, పరిశోధన వ్యాసాలు ,విద్యార్థుల్లో పరిశోధన ఆసక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు
Oct 30 2023, 21:44