NLG: జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయండి: సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వామపక్షాలను మోసం చేసిందని, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయాలని, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కంచర్ల రవి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప అర్హులైన నిరుపేదలకు అందలేదని వారు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల ముందు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు లేకుండా బిఆర్ఎస్ గెలిచేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటినా.. అర్హులైన నిరుపేదలకు, కొత్తగా పెండ్లీలు అయినా పేదలకు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, హఠాత్తుగా అధికార ప్రభుత్వం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అమలు చేయలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శిమోగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.
Oct 30 2023, 12:47