నల్లగొండ మున్సిపల్ చైర్మన్ వార్డులో కదిలిన భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార రథం.. ఒక పండగల కదిలించిన జన సమూహం..
బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు... 17, 16, 15 వార్డులలో.. విస్తృతంగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సొంతవార్డు కావడంతో...
పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..
అడుగడుగునా కంచర్లకు జననీరాజనాలు..
చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు జెండాలు చేత బుని కారు గుర్తు గెలవాలని, మళ్లీ కంచర్ల ఎమ్మెల్యేగా... గెలవాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగిన వందలాదిమంది జనం.
ఆర్జాల బావి, తదితర సమావేశాల్లో మాట్లాడిన కంచర్ల...
నల్లగొండలో... 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శనవేగంగా కొనసాగుతున్నాయని మరో రెండు సంవత్సరాల్లో అవి పూర్తవుతాయని అవి పూర్తి కావాలంటే మళ్ళీ నల్లగొండలో గులాబీ జెండా ఎగరాలే కెసిఆర్ ప్రభుత్వమే రావాలనిఅన్నారు.
ఇందుకు మీ సహకారము ఆశీర్వచనాలు కావాలని.. చైతన్యవంతులైన నల్లగొండ ప్రజలు నల్లగొండ అభివృద్ధిని చూసి తనను తప్పక మళ్ళీ గెలిపిస్తారని విశ్వాసం తమకు ఉందని, ఉన్నారు..
నల్లగొండ ప్రజలు... కరోనాతో విలవిల లాడుతూ హాస్పిటల్ లో వందలాదిమంది... చికిత్స పొందుతుంటే.. తను వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని.. పరామర్శించి ధైర్యం చెప్పానని... వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలని... కరోనాతో మరణించిన వారి.. దహన సంస్కారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయలేకపోతే తానే దగ్గర ఉండి ఆ విధులు నిర్వహించానని... మరి నల్లగొండలో నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి ఎక్కడ ఉన్నాడో ప్రజలు ప్రశ్నించాలని కోరారు.. నిరంతరం ప్రజల మధ్య 365 రోజులు ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ.. మీ మధ్యన ఉన్నానన్నారు.
గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి.. బత్తాయి మార్కెట్ తెస్తానన్నాడు మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు, ఐటీ మంత్రిగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానన్నాడు... వీటిలో ఏ ఒక్కటి తేలేదని, కెసిఆర్ నాయకత్వంలో అవన్నీ తాము తీసుకొచ్చామని,పానగల్ మర్రిగూడ, బైపాస్ రోడ్ ల లో ఫ్లైఓవర్ నిర్మించకుండా...
పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొన్నాడనన్నారు.
ఇప్పుడు ఆ రెండు ఫ్లై ఓవర్ ల లో పానగల్ ఫ్లైఓవర్ పూర్తయిందని మర్రిగూడ ఫ్లైఓవర్ శర వేగంగా నిర్మాణం అవుతుందన్నారు.
తను నిరంతరం ప్రజలకు ప్రజల మధ్యన ఉంటూ... ప్రజల్ని నమ్ముకున్నానని... కానీ కోమటిరెడ్డి నోట్ల కట్టలతో... నాయకులను కొని వారిని నమ్ముకున్నాడని... అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని కంచర్ల కోరారు.
కెసిఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక... ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 వరకు విడతల వారిగా పెంచుతారని, దివ్యాంగుల పెన్షన్ 6016 చేస్తారని, రైతుబంధు 12000 నుంచి 16 వేల వరకు విడుతలవారీగా పెంచుతారని, అర్హులైన మహిళలకు ₹3,000 భృతి అందిస్తారని, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తారని, బిపిఎల్ కుటుంబాల అందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని తెలిపారు. నల్లగొండ అభివృద్ధి కొనసాగాలంటే రెండవసారిగా మీ సేవకుడిగా రక్షకుడిగా .. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మోదుగు రాజ వర్ధన్ రెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, 16వ వార్డు ఇంచార్జ్ దాసరి రమేష్,15 వ వార్డు ఇంచార్జి దొడ్డి రమేష్, యుగంధర్ రెడ్డి ఇస్రం రవి,ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కట్టా హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
Oct 29 2023, 18:12