NLG: సొంత గూటికి చేరిన నాయకులు
నల్గొండ: పట్టణంలోని 21 వార్డు కౌన్సిలర్ పరహత్ ఫర్జానా ఇబ్రహీం మరియు కంచనపల్లి ఎంపీటీసీ సహదేవ్ దోమలపల్లి ఎంపిటిసి దేశగాని నరసింహ, శనివారం హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బెదిరింపులతో తెరాస పార్టీలో చేర్చుకొని, చేరిన తర్వాత మండల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాలే చూసుకున్న భూపాల్ రెడ్డిని మరోసారి నమ్మడానికి నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరని.. ఆయన ఓటమి ఇప్పటికే ఖాయం అయిందని అందుకే పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఎవరు అదైర్యపడోద్దు అని అన్నారు.
మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ఇండ్లు లేని వారికి ఆనాడే ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని, రైతులకు పేదలకు యువతకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం.. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని, రాబోయే 32 రోజులు కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి వస్తుంది. 5 సం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.












Oct 29 2023, 10:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.4k