చోర్ కాంగ్రెస్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: కేటీఆర్
చోర్ కాంగ్రెస్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: మంత్రి కేటీఆర్
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్. అంటే చోర్ కాంగ్రెస్. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ కామన్వెల్త్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే
అగస్టా, కామన్వెల్త్ మొదలు బొగ్గు దాకా దోచేశారు
అవినీతి, కుటుంబపాలనపై రాహుల్ మాట్లాడటమా?
నల్లగొండ ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పాలనదే
దివ్యాంగులకు అత్యధిక పింఛను తెలంగాణలోనే
కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒక్కరు
మరోసారి బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను దీవించాలి
దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్. అంటే చోర్ కాంగ్రెస్. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ కామన్వెల్త్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే
– మంత్రి కేటీఆర్
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్.. అంటే చోర్ కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, అలాంటిది అవినీతి గురించి రాహుల్ మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి నేతృత్వంలో గురువారం నిర్వహించిన దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జవహర్‌లాల్‌నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ.. ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ.. ఆయన భార్య సోనియా గాంధీ.. ఆమె కొడుకు రాహుల్‌గాంధీ, కూతురు ప్రియాంకగాంధీ కుటుంబపాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయమే రూ.80 వేల కోట్లు అని, అమెరికాకు చెందిన సంస్థలు సైతం ఆ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించాయని తెలిపారు. ప్రాజెక్టు ఖర్చు కంటే అవినీతి ఎక్కువైందనటంపై మండిపడ్డారు. రాహుల్‌గాంధీ లీడర్ కాదని, రీడర్ అని.. స్థానిక కాంగ్రెస్ నేతలు రాసించ్చిందే చదువుతారని ఎద్దేవా చేశారు.
పుట్టుక నుంచి చావు వరకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం అన్ని రంగాలను కేసీఆర్ బాగు చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒక్కరు వస్తారు. అలాంటి నాయకుడి సారథ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాలి.
– మంత్రి కేటీఆర్
ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌దే
కాంగ్రెస్, బీజేపీలు దివ్యాంగులను ఎన్నడూ మనుషులుగా కూడా చూడలేదని, కానీ నేడు ఓట్ల కోసం చాలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కేవలం 47 వేల మందికి, అదీ అనేక కొర్రీలు పెట్టి రూ.600-రూ.1,000 మాత్రమే పింఛను ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో 1.25 లక్షల మందికి రూ.200 చొప్పున, కర్ణాటకలో రూ.1,100, యూపీ, రాజస్థాన్‌లో అంతే ఉన్నదని తెలంగాణలో మాత్రం రూ.4,000 ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.
ఎవరూ అడగకముందే సీఎం కేసీఆర్ దివ్యాంగుల పిం ఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారని, 5.65 లక్షల మందికి అందిస్తున్నారని, గెలిచాక రూ.6,016కు పెంచనున్నట్టు వెల్లడించారు. తొమ్మిదేండ్లలో దివ్యాంగుల పింఛను కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,300 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. దివ్యాంగులు సమాజాన్ని ప్రభావితం చేయగలరని, అం దుకు సిరిసిల్లకు చెందిన దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరిని ఉదహరించారు. దివ్యాంగులు ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేసి పదిమందితో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగుల సంక్షేమంలో ఆదర్శం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద అందరి కీ ఇచ్చేలా కాకుండా దివ్యాంగులకు అదనంగా రూ.1.25 లక్షలు కలిపి మొత్తంగా రూ.2.25 లక్షలు నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దివ్యాంగుల కు 2.75 లక్షలకుపైగా బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్లు, బధిరులు, అంధులకు అత్యాధునిక ఉపకరణాలను ఉచితంగా అందజేశామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4శాతానికి పెంచామని, డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి ఇలా అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందని స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపకల్పన చేసిన 'దివ్యాంగుల బతుకుల్లో దినకరుడమ్మా.. దివ్యం గా వెలుగు వెదజల్లాడమ్మా' పాటను కేటీఆర్ ఆవిష్కరించారు.
దివ్యాంగుల్లో ఆత్మనిబ్బరం: వాసుదేవరెడ్డి
దివ్యాంగ సమాజం ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మనిబ్బరంతో జీవిస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లేనని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపుతో అనేక మంది దివ్యాంగుల్లో మంత్రి కేటీఆర్ వెలుగులు ప్రసాదించారని కొనియాడారు. దివ్యాంగుల కృతజ్ఞత సభ కు విచ్చేసిన మంత్రి కేటీఆర్‌కు వాసుదేవరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్, సుధీర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, చందర్‌రావు, దివ్యాంగుల ప్రతినిధులు రాజేశ్వరి, శ్రీనివాస్, మదర్‌పాషా, రాజు, చందర్, 2 వేల మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు.
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్. అంటే చోర్ కాంగ్రెస్. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోపోర్స్, సీ కామన్వెల్త్ ఇలా చెప్పుకుంటూ ఏ టు జెడ్.. ఆగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాక దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే
– మంత్రి కేటీఆర్
రేవంత్ గజదొంగ
'రాహుల్‌గాంధీ పక్కన ఉన్న రేవంత్‌రెడ్డిని మించిన గజదొంగ లేడు. చార్లెస్ శో భరాజ్, దావుద్ ఇబ్రహీం కూడా రేవంత్ ముందు చిన్నోళ్లు. నాడు నోటుకు ఓటు. నేడు సీటుకు రేటు. రేపు రాష్ట్రం మొత్తా న్ని, కాంగ్రెస్‌ను కూడా బీజేపీకి టోకున అమ్ముతడు. అలాంటి నేతను పక్కన పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడటమా?' అని అన్నారు. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకోవాల్సి న దుస్థితి కాంగ్రెస్‌దని, పార్టీ నేతలతో మాట్లాడితే రేవంత్ బాగోతాలను చెప్తారని అన్నారు. కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెం ట్, కోవర్ట్ రేవంతే అని ఆరోపించారు. గాడ్సేకు గాంధీభవన్‌ను అప్పగించారని చురకలు అంటించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా కూడా చేయని రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి దిమ్మతిరిగేలా ఓట్లతో జవాబివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Oct 28 2023, 22:22