NLG: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాల కు ప్రజలు మోసపోవద్దు: CPI-ML న్యూడెమోక్రసీ పిలుపు
శాలి గౌరారం: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని,ఓట్లకోసం గ్రామాలకు వచ్చే వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,అంబటి చిరంజీవి లు ప్రజలకు పిలుపునిచ్చారు.
శాలి గౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. తొమ్మిదేండ్లలో నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలి చావులు, ధరల పెరుగుదల, రైతులు ఆత్మహత్యలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. కార్పొరేట్ కు రాయితీలు, ప్రజలపై పన్నుల భారం మోపి.. దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మొదలుకొని రైతు రుణమాఫీ వరకు, డబల్ బెడ్రూం నుండి మూడెకరాల భూమి వరకు అన్ని ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పథకాలుగా మార్చి, సొంత పార్టీలోని ఉన్నత వర్గాలకు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దళారులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లోకి వచ్చే రాజకీయ నాయకులను గత హామీలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పై, రోడ్లు, తాగునీరు, ఐకేపీ సెంటర్స్, తదితర అంశాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 25 2023, 21:06