TS: బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కీలక నేతలు వ్యూహాత్మక నిర్ణయాలు చేపట్టి పార్టీలు మారుతున్నారు. ఇదే తరహాలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కెసిఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి, 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు, మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేయగా స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది అని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షా కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని.. నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
నాడు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరినా, నేడు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసిఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాట పడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నానని తెలిపారు.
అక్టోబర్ 27న మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.






నల్లగొండ: పట్టణ బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు దుబ్బ రూప అశోక్ సుందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దుబ్బ అశోక్ సుందర్, ఈ రోజు హైదరబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.
ఈ సందర్బంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి, కోమటిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత తొమ్మిది రోజులుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మాడవీధుల్లో తిరిగే స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతుండటంతో నేడు మంగళవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని 79,693 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,864మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ పాక నగేష్ మాట్లాడుతూ.. దసరా పండుగను గ్రామ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరూ పైన ఉండాలని.. సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Oct 25 2023, 14:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k