52 మంది అభ్యర్థులతో బిజేపి మొదటి జాబితా విడుదల
TS: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
అభ్యర్థుల జాబితా:
1. సిర్పూర్ - డా.పాల్వయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి (ఎస్సీ) - శ్రీమతి అమరాజుల శ్రీదేవి
3. ఖానాపూర్(ఎస్టీ) - రమేష్ రాథోడ్
4. ఆదిలాబాద్ - పాయల్ శంకర్
5. బోధ్(ఎస్టీ) - సోయం బాబు రావు (ఎంపీ)
6. నిర్మల్ - ఆలేటి మహేశ్వర్ రెడ్డి
7. ముదోల్ - రామారావు పటేల్
8. ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి
9. జుక్కల్ (ఎస్సీ) - టీ. అరుణ తార
10. కామారెడ్డి - కే. వెంకట రమణారెడ్డి
11. నిజామాబాద్ అర్బన్ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
12. బాల్కొండ - అన్నపూర్ణమ్మ ఆలేటి
13. కోరుట్ల - ధర్మపురి అరవింద్ (ఎంపీ)
14. జగిత్యాల - డా బోగా శ్రావణి
15. ధర్మపురి (ఎస్సీ) - ఎస్ కుమార్
16. రామగుండం - కందుల సంధ్యారాణి
17. కరీంగనర్ - బండి సంజయ్ (ఎంపీ)
18. చొప్పదండి (ఎస్సీ) - బొడిగే శోభ
19. సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి
20. మానకొండూర్ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్
21. హుజురాబాద్ - ఈటెల రాజేందర్
22. నార్సాపూర్ - ఎర్రగొళ్ల మురళీ యాదవ్
23. పఠాన్‌చెరు - టీ.నందీశ్వర్ గౌడ్
24. దుబ్బాక - రఘనందన్ రావు
25. గజ్వేల్ - ఈటెల రాజేందర్
26. కుత్భుల్లాపూర్ - కునా శ్రీశైలం గౌడ్
27. ఇబ్రహింపట్నం - నోముల దయానంద్ గౌడ్
28. మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
29. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
30. కార్వాన్ - అమర్ సింగ్
31. గోషామహల్ - టీ రాజాసింగ్
32. చార్మినార్ - మేఘా రాణి
33. చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్
34. యాకత్పురా - వీరేంద్ర యాదవ్
35. బహ్దుర్‌పురా - వై. నరేష్ కుమార్
36. కల్వకుర్తి - తల్లోజు ఆచార్య
37. కొల్లాపూర్ - అల్లెని సుధాకర్ రావు
38. నాగార్జున సాగర్ - కంకణాల నవనీత రెడ్డి
39. సూర్యపేట - సంకినేని వెంకటేశ్వర్ రావు
40. బోనగిరి - గూడూరు నారాయణ రెడ్డి
41. తుంగతుర్తి (ఎస్సీ) - కడియం రామచంద్రయ్య
42. జనగామ - డా.దశ్మంత్ రెడ్డి
43. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) - డా.గుండె విజయ రామారావు
44. పాలకుర్తి - లేగా రామ్మోహన్ రెడ్డి
45. డోర్నకల్ (ఎస్టీ) - భుక్యా సంగీత
46. మహబుబాబాద్(ఎస్టీ) - జాతోత్ హుసేన్ నాయక్
47. వరంగల్ పశ్చిమ - రావు పద్మ
48. వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు
49. వర్ధన్నపేట (ఎస్సీ) - కొండేటి శ్రీధర్
50. భూపాలపల్లి - చందుపట్ల కీర్తి రెడ్డి
51. ఇల్లందు (ఎస్టీ) - రవీంద్ర నాయక్
52. భద్రాచలం (ఎస్టీ) - కుంజా ధర్మారావు

TS: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా
హైదరాబాద్: టిటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, హైదరాబాద్ నందు రాష్ట్ర పార్టీ సమావేశం జరుగును.
ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ లు హజరుకానున్నారని తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో తెలియచేసింది.
TS: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గా నిలిచే బతకమ్మ పండుగ సంబరాలలో చివరిరోజైన 'సద్దుల బతుకమ్మ' పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరపనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేడు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. సాయంత్రం వేళలో మహిళలు బతుకమ్మలను పేర్చి ఒక చోటకు చేరి బతుకమ్మ ఆటపాట లతో ఘనంగా నిర్వహించి అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేరుస్తారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం: పది ప్రధాన హామీలతో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో విడుదల చేసిన మ్యానిఫెస్టో.. రాష్ట్రంలో బహుజనులకు భరోసా కల్పించే అసలైన మేనిఫెస్టో అని నకిరేకల్ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థిని మేడి ప్రియదర్శిని అన్నారు.
శనివారం నార్కట్ పల్లి మండలం చిప్పలపల్లి, తిరుమలగిరి, జువ్వుగూడెం, చిన్న కపర్తి, అవులోనిబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గడప గడపకు తిరుగుతూ, ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని మేడి ప్రియదర్శిని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ మ్యానిఫెస్టోలో అందరికీ విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలు, రైతు సంక్షేమం,పేదలకు భూమి హక్కు, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పేరిట మహిళలకు వరాలు, ఇంటి హక్కు మొదలైన వాటికి పెద్దపీట వేసిందని తెలిపారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించిందన్నారు.
ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షులు జోగు శేఖర్, మహేష్, యోగి, ఉదయ్, మల్లేష్, వినయ్, మల్లికార్జున్, బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి శనివారం ఉదయం 8.30 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది.
దీని ద్వారా క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించనున్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు, ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సన్నాహకంగా పలు కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం లోని లెంకలపల్లి గ్రామంలో.. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాంధీ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన దుర్గామాత మంటపం వద్ద మహిమాన్విత శక్తి స్వరూపిణి దుర్గామాతకు ఐదవ రోజు శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు.
5 వ రోజు శుక్రవారం అమ్మవారు సరస్వతీ మాత గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భవానీలు మరియు పలువురు భక్తులు సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు బోనస్ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల బోనస్ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది.
ఈ నిర్ణయంతో సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు రూ.1.53 లక్షల చొప్పున బోనస్ అందనుంది. ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం భేటీ అయ్యారు. ఇవ్వాళ ఉదయం కరీంనగర్ వీపార్క్ హోటల్‌కు చేరుకున్న కోదండరాం.. రాహుల్ గాంధీ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా.. పోటీకి ఆసక్తి లేదని తేల్చి ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు.
తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణు గోపాల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Oct 22 2023, 21:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k