RR: యువతకు ఉపాది కల్పనలో ప్రభుత్వం విఫలం: మల్ రెడ్డి రంగారెడ్డి
యాచారం మండలం, నందివనపర్తి గ్రామానికి చెందిన 30 మంది యువకులు వివిధ పార్టీల నుండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిపిపిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి, వారికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలనుండి కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన విషయాన్నీ యువత తెలుసుకున్నదని, కాబట్టి కాంగ్రెస్ లోకి వలసలు గా వస్తున్నారని అన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో యువత కు తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుందని, కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ లో యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, ఓబీసి సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, మండల పార్టీ ప్రెసిడెంట్ మస్కు నర్సింహా, సీనియర్ నాయకులు, అమృత కేసరి సాగర్, గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్ కాకుమాను సునీల్,మేతరి దర్శన్, గులాం అక్బర్, మోటే శ్రీశైలం,బిక్షపతి, రామ్ నాథ్ రెడ్డి, మొహమ్మద్ గౌస్, శ్రీశైలం, శ్యామ్ లాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు

యాచారం మండలం, నందివనపర్తి గ్రామానికి చెందిన 30 మంది యువకులు వివిధ పార్టీల నుండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిపిపిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి, వారికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, ఓబీసి సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, మండల పార్టీ ప్రెసిడెంట్ మస్కు నర్సింహా, సీనియర్ నాయకులు, అమృత కేసరి సాగర్, గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్ కాకుమాను సునీల్,మేతరి దర్శన్, గులాం అక్బర్, మోటే శ్రీశైలం,బిక్షపతి, రామ్ నాథ్ రెడ్డి, మొహమ్మద్ గౌస్, శ్రీశైలం, శ్యామ్ లాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు

మర్రిగూడ: పాలకులు వాగ్దానాలు తప్ప పనులు పూర్తి చేయడంలో విఫలం చెందారని, సంవత్సరాల తరబడి చర్లగూడెం కిష్టరాంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలం చెందారని, వెంటనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి, ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.
దళిత బంధు పేర్లు ప్రతిపాదన చేయడంలో గోరంగా విఫలం చెందారని విమర్శించారు. దేశ రాజకీయాలలో బిజెపి, ప్రజలను వంచించడానికి మరొకసారి మునుగోడులో ప్రయోగం చేయ చూస్తున్నదని, ప్రజలు తిప్పికొట్టాలని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో సిపిఎం తన సత్తా ఏమిటో చూపించనున్నట్లు తెలిపారు.
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి మరియు జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించి, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం SVEEP పై ఆర్పీ లకు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలో ఓటు నమోదు శాతాన్ని పెంచాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, ఓటు నమోదు శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలని సందర్శించి ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఓటు నమోదు శాతాన్ని పెంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
SB NEWS NALGONDA DIST
భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో.. రాహుల్ గాంధీ మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం కార్నర్ సెంటర్ కి రాహుల్ గాంధీ చేరుకొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అవినీతి ప్రభుత్వము ఒక తెలంగాణలోనే ఉందని, తెలంగాణలో అన్ని అధికారాలు ఒక్క కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు.
ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. కెసిఆర్ అవినీతిపై ఈడి, సిబిఐ, విచారణ ఎందుకు జరపడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారని విమర్శించారు. తెలంగాణలో పేదల, రైతుల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఈ రోజు మహా చండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఐతే ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చేవారు. ఈ సారి మాత్రం వైదిక కమిటీ నిర్ణయం మేరకు చండి అలంకారానికి మార్చారు. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో ఈ ఏడాది అమ్మవారి అలంకారాలలో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందని పండితులు అంటున్నారు.
70 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా, సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ విధించిన కారణంగా.. రాష్ట్రంలో వారం రోజుల్లో నగదు, మద్యం, బంగారం స్వాధీనం విలువ.. రూ. 101 కోట్లు దాటిందని తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఎన్నికల నియమావళి నుండి నేడు 17వ తేదీ వరకు రూ.101 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్ కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు.
డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా.. అని కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి, వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు. గన్‌పార్క్ వద్దకు వెళ్లి తీరుతామని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరకు పోలీసుల వాహనంలో రేవంత్ రెడ్డిని తరలించారు.
హైదరాబాద్: బహుజన భరోసా పేరుతో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. 2023 అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో.. నేడు బీఎస్పీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 పథకాలతో కూడిన బీఎస్పీ మేనిఫెస్టో ను విడుదల చేసారు.
నల్లగొండ జిల్లా
ఈ క్యాంపులో బిపి మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, సిహెచ్ఓ, హెచ్ వి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Oct 20 2023, 19:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.2k