పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కంచర్ల భూపాల్ రెడ్డి
పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి .... నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ & జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ...
తనకచ్చొచ్చిన.. పానగల్లు నుండి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం లో... కోలాహలంగా ...ఎన్నికల ప్రచారం ప్రారంభించిన..కంచర్ల
నుదుట విజయ తిలకం దిద్ది... ఘనస్వాగతం పలికిన స్థానిక కౌన్సిలర్, ఆలకుంట రాజేశ్వరి మోహన్ బాబు... ముఖ్య నాయకులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు...
ఇంటింటికి, మంగళహారతులతో.. విజయ తిలకం దిద్దిన మహిళలు..
పానగల్లు ఇంటింటికి కంచర్ల వెంట నడిచిన వందలాది మంది మహిళలు...
డప్పుల మోతలతో కోలాటాల విన్యాసాలతో.... వందలాది మంది కార్యకర్తలతో హోరెత్తిన పానగల్లు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజల అనంతరం
జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్... నల్లగొండ బిఆరెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి గారిని రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు.. నల్లగొండకు తేవాలన్నా కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని... కారు గుర్తుపై ఓటు వేసి భూపాల్ రెడ్డి గారిని గెలిపించాలని నల్లగొండ అభివృద్ధిని కొనసాగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కంచర్ల మాట్లాడుతూ... నల్లగొండ పట్టణ అభివృద్ధి1350 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని మరో రెండు సంవత్సరాలలో ఆ పనులన్నీ పూర్తి అవుతాయని... విద్యా భారతి నుండి అద్దంకి రోడ్డు వరకు... ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డును రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున్నామని, ఉదయ సముద్రం పక్కనే ఉన్న పానగల్లు గతంలో తాగునీరు వచ్చేవి కావని.. ఆ ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీరు అందిస్తున్నామని.. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైవే నిర్మాణం పూర్తి చేసుకున్నామని.,. ఎన్నో ప్రమాదాల కారణమైన పానగల్ బైపాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని ... గతంలో ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కడతామని హామీ ఇచ్చామని... ఒక సంవత్సరం ఎన్నికలు రెండు సంవత్సరాల కరోనాతో.. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో కొంత ఆలస్యమైందని .
ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం...
ఆసరా పెన్షన్లు ముందు 3016- ఆ తర్వాత ప్రతి సంవత్సరం 500 పెంచుతూ 5,016/- రూపాయలు.. దివ్యాంగుల పెన్షన్ 6,016 /-
రైతుబంధు 12 వేల నుంచి 16 వేల వరకు.. విడతల వారిగా పెంచుతామని, బిపిఎల్ కుటుంబాలకు అందరికీ 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని.. గ్యాస్ సిలిండర్ ను 400 రూపాయలకే అందిస్తామని.. అర్హులైన మహిళలకు 3000 రూపాయల నెలవారి భృతి ఇస్తామనితెలిపారు.. గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలుపుకున్నారని, ఇప్పుడు ప్రకటించినవి కూడా కచ్చితంగా అమలు చేస్తారన్నారు..
గత 20 సంవత్సరాలుగా మాయమాటలతో నల్లగొండను అభివృద్ధికి దూరం చేసిన నాయకులు, మళ్ళీ మీ ముందుకు వస్తారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కారు గుర్తుపై మీ ఓటు వేసి మరొక్కసారి తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపి నల్లగొండ అభివృద్ధికి దోహదపడాలని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నేడు పానగల్లు ఒకటి రెండు వార్డులలో.. సాయంత్రం 6 గంటల నుండి మూడో వార్డులో ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు
భారీ ఎత్తున, పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,
Oct 20 2023, 18:22