మర్రిగూడ: రైతు సంఘం మండల కమిటీ సమావేశం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ నాంపల్లి, మండలాల తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం సోమవారం, సిపిఎం పార్టీ కార్యాలయంలో కొట్టం యాదయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బండ శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ 100 కు 40 శాతం మందికి రుణమాఫీ రాకుండా పోయింది. రైతుబంధు పెండింగ్లో ఉన్నవారికి ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్న రైతుబంధు రైతు ఖాతాలో జమ చేయాలని, రుణమాఫీ రైతు ఖాతాలో జమచేయాలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, సంక్షేమ పథకాలు.. నిరుపేదలను గుర్తించి గ్రామసభల ద్వారా ఎంపిక చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ దీనికి భిన్నంగా సంపన్నులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.
రేపు జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వారిని ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బాష్పాక ముత్తి లింగం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, నీలకంఠం రాములు, చెల్లం ముత్యాలు, గిరి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Oct 19 2023, 09:37