TS: ఘనంగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 10వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, 10వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం లకిడికపూల్ లోని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ నందు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎస్డి జాతీయ చైర్మన్ హెచ్ఆర్ గోయల్, విశిష్ట అతిధి జాతీయ సెక్రెటరీ జనరల్ అశోక్ షిండే, మాజీ జాతీయ చైర్మన్ ఎస్. చంద్రయ్య, దక్షిణ భారత సెక్రటరీ వైజ్ నాథ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్రను విపులంగా వివరించారు. ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. లక్ష్మయ్య నైతిక విలువల పైన ప్రసంగించారు.
అదేవిధంగా మరో వక్త మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ మాట్లాడుతూ.. సంగం అభివృద్ధి, నాయకత్వ లక్షణాల పైన విపులంగా వివరించారు. మరో వక్త మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి.యాదయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ అనంతరం దళిత ఉద్యమం గురించి వివరించారు. అనంతరం పలువురు సంఘ సభ్యులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటస్వామి, ఉపాధ్యక్షులు వై. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బి. వెంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు బిందుశ్రీ, మహిళా ప్రధాన కార్యదర్శి ఎం.విజయ మరియు జాతీయ, రాష్ట్ర హోదా కలిగిన నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, అంబేద్కర్ వాదులు, పలువురు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS TELANGANA
SB NEWS NATIONAL MEDIA
Oct 16 2023, 19:04