NLG: ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా 2వసారి దళిత రత్న బుర్రి వెంకన్న
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర 10వ మహాసభలు హైదరాబాదులోని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ (శాంతి చక్ర ఇంటర్నేషనల్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ హాల్ లో ఆదివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి దాసరి లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జాతీయ చైర్మన్ డాక్టర్ హెచ్.ఆర్. గోయల్, జాతీయ సెక్రెటరీ జనరల్ అశోక్ శెండే, మాజీ జాతీయ చైర్మన్ ఎస్.చంద్రయ్య, మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి. యాదయ్య, దక్షిణ భారతదేశం సెక్రెటరీ వైద్యనాథ్, వక్తలుగా ప్రొఫెసర్ కాశీమ్, డాక్టర్ బైరీ నరేష్, డాక్టర్ డి.యాదయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న బుర్రి వెంకన్న ను మరోసారి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బుర్రి వెంకన్న మాట్లాడుతూ... నామీద నమ్మకం ఉంచి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు నా ప్రత్యేకమైన జై భీమ్ లు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగ హక్కులు ప్రజలకు తెలిసే విధంగా కృషి చేస్తానని, గ్రామాలలో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయని, వారిని సైన్స్ మీద నమ్మకం కలిగేటట్లు చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి తెలిసే విధంగా చైతన్యపరుస్తానని, బాబా సాహెబ్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంస్థలో పనిచేయడం సంతోషకరమని అన్నారు.
నల్గొండ జిల్లాలోని గ్రామ మండలాలలో మరియు జిల్లాలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ పూర్తి బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నా మీద నమ్మకము తో నన్ను రెండవ సారి రాష్ట్ర శాఖలో అవకాశం కల్పించినందుకు జాతీయ కమిటీ మరియు మాజీ జాతీయ అధ్యక్షులు చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య కు, కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ అని తెలియజేశారు
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 16 2023, 13:24