NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అద్భుతంగా ఆడి పాడారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకయైన బతుకమ్మ పండుగను, ప్రతి పల్లెలో ఆడపడుచులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణే పరమార్ధంగా ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా, ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని అన్నారు
సాహిత్య సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారత విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి, డాక్టర్ నాగుల వేణు,ఇ. యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాణి, డాక్టర్ ఎన్. దీపిక, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ వి. శ్రీధర్, డాక్టర్ ఎ.దుర్గా ప్రసాద్, కె. మల్లేష్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 14 2023, 17:47