NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగుల వేణు కు డాక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నాగుల వేణు కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేట్ ను ప్రధానం చేసింది.
"యాదాద్రి భువనగిరి జిల్లా లో పంచాయతీరాజ్ వ్యవస్థలు మహిళ సాధికారత" అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు నాగుల వేణు కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించి, సన్మానించి ఘనంగా సత్కరించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నాగుల వేణు కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేట్ ను ప్రధానం చేసింది.
"యాదాద్రి భువనగిరి జిల్లా లో పంచాయతీరాజ్ వ్యవస్థలు మహిళ సాధికారత" అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు నాగుల వేణు కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు కళాశాల ప్రథానా చార్యులు డా. ఘనశ్యాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. పండ్లు, ఫలహారాల తో బతుకమ్మలను పూజించారు.ఈ బతుకమ్మ సంబరాలలో ప్రథానాచార్యులు, ఉప ప్రథానాచార్యులు, అధ్యాపక బృందం, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
SB NEWS NALGONDA DIST
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అద్భుతంగా ఆడి పాడారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకయైన బతుకమ్మ పండుగను, ప్రతి పల్లెలో ఆడపడుచులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణే పరమార్ధంగా ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా, ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని అన్నారు
సాహిత్య సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారత విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి, డాక్టర్ నాగుల వేణు,ఇ. యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాణి, డాక్టర్ ఎన్. దీపిక, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ వి. శ్రీధర్, డాక్టర్ ఎ.దుర్గా ప్రసాద్, కె. మల్లేష్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
YBD: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్ స్టాప్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ట్రినిటీ స్కూల్ యాజమాన్యం బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగినది.
మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే పూల పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి బాలరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ క్రిష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల, గాంధీ గ్లోబల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం మట్కా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.
ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే పరేడ్ కొరకు, నవంబర్ 1 నుండి విజయవాడలో జరిగే ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రి- రిపబ్లిక్ డే పరేడ్ కోసం.. ఈ నెల 4 ఎం.జి యూనివర్సిటీ లో జరిగిన వాలంటీర్ల ఎంపికలో ఎన్జీ కళాశాల విద్యార్దిని డి. కామేశ్వరి ఎంపిక అయిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన కామేశ్వరి ని అభినందిస్తూ ఒక మొక్కను బహుమతిగా అందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లు యాదగిరి రెడ్డి, వెంకట రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, శీలం యాదగిరి, లైబ్రరీ విభాగం దుర్గా ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, తదితరులు పాల్గొని విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.
Oct 14 2023, 10:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.4k