రైతులను మోసం చేస్తున్న కేసీఆర్: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం విమర్శించారు.గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కలిగిన పేద రైతులకు, రుణమాఫీ అయిన రైతులకు.. తిరిగి పంట రుణాలు ఇవ్వాలని వారు అన్నారు. అసైన్డ్, ఇనాం భూములు కలిగిన పేద రైతులకు తిరిగి పంట రుణం ఇవ్వకుండా, బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నాయకులు కొత్తపల్లి నరసింహ, గౌస్యబేగం, బల్లెం స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Oct 12 2023, 18:03