నకిరేకల్: క్యూబా విప్లవకారుడు కామ్రేడ్ చేగువేరా స్ఫూర్తితో పోరాడుదాం: డేవిడ్ కుమార్
NLG: క్యూబా ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవ యోధుడు.. కామ్రేడ్ చేగువేరా స్పూర్తితో ఉద్యమించాలని CPI (M-L ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో AIKMS జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి అధ్యక్షతన చేగువేరా వర్ధంతి సభను సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చేగువేరా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. దోపిడీ, పీడన, అసమానతలు లేని వ్యవస్థను క్యూబాలో చేగువేరా నిర్మించాడని అన్నారు. ఎల్లలు లేని విశాల దృక్పథంతో స్వేచ్ఛయుత సమాజం కోసం అనారోగ్యం ను లెక్కచేయకుండా, చిన్న వయసులోనే అవిరామంగా పోరాటం చేసినాడని గుర్తు చేశారు. నేటి యువత చేగువేరా స్పూర్తితో పోరాడాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తనకు ఆయాసం ఒక చిన్న సమస్యగా ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ బైక్ ప్రయాణం చేస్తూ ప్రజలకు కూడా హక్కులు ఉంటాయని.. 'బానిసలుగా బ్రతకడం కన్నా లేచి నిలబడి దైర్యం గా ప్రాణాలు వదిలేయడం మేలు' అని ప్రజల్లో స్ఫూర్తినిచ్చే మాటలను చెప్తూ ప్రజల అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని, శత్రువుల చేతిలో ప్రాణాలు పోతున్నా అతని కళ్ళల్లో ఎక్కడ కూడా భయం కనపడలేదని ఆయనను కొనియాడారు.
పోరాట పటిమ కసి, చిరునవ్వు మాత్రమే కనిపించిందని, శత్రువులకు కూడా ఆశ్చర్యం కలిగించేలా చేసిన యోధుడు చేగువేరా అని, కాల్చి చంపుతున్నా.. ఒనకని బెనకని గుండెల నిండా దైర్యం ఉన్న మనిషి, ప్రపంచ విప్లవ కారుడు కామ్రేడ్ చేగువేరా అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో PYL రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్, AIKMS జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, POW జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, AIKMS జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకన్న, బూరుగు సత్తయ్య, జానపాటి దేవయ్య, PYL జిల్లా అధ్యక్షుడు మామిడోజు వెంకటేశ్వర్లు, రావుల లింగయ్య, బండారి వెంకన్న, వేముల శంకర్, దేవరకొండ జానయ్య, పసుపులేటి సోమయ్య, చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Oct 10 2023, 20:43